రాత్రి పూట ఈ టీ తాగితే చాలంట షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

రాత్రి పూట ఈ టీ తాగితే చాలంట షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

8 months ago | 5 Views

ప్రస్తుతం ఎంతోమంది షుగర్ అనే వ్యాధితో సఫర్ అవుతున్నారు. ఇదంతా భయంకరమైన వ్యాధిగా చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న మెడిసిన్స్ కి మన మంచి ఆహారాలవాట్లు తోడైతే ఈ షుగర్ అసలు పెద్ద విషయమే కాదు అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా రాత్రిపూట ఒక టీ తాగితే చాలంట షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చట.

అది ఏదో కాదు కుంకుమపువ్వు టీ. అవును..పండంటి బిడ్డ పుట్టాలంటూ గర్భిణులకు కుంకుమపువ్వు పాలలో వేసి ఇస్తుంటారు. కుంకుమ పువ్వు రేకులలో ఔషధగుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పువ్వు రేకులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. అందాన్నీ రెట్టింపు చేస్తాయి. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉంటాయి. 

రాత్రిపూట నిద్రపోయే సమయంలో కుంకుమపువ్వు టీ తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


కుంకుమపువ్వు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుందిని అధ్యయనాలు పేర్కొన్నాయి. రాత్రి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే.. ప్రశాంతంగా నిద్రపడుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది.

కాగా కుంకుమపువ్వు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. రాత్రిపూట కుంకుమపువ్వు టీ తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

అంతేకాదట రాత్రి పూట కుంకుమపువ్వు టీ తాగితే.. ముఖంపై పిగ్మంటేషన్‌ మచ్చలు, గీతలు దూరమవుతాయి. సూర్య కిరణాల దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. ఇలా రోజూ చేస్తే పదేళ్ల వయసు తగ్గినట్లుగా ముడతల్లేకుండా.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇక ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ టీ ని దూరం పెట్టడం. తాగేయండి. 

ఇంకా చదవండి: రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారాలు ఏవో తెలుసా. ఇదిగో లిస్ట్ 

# Kunkuma puvvu