ఈ జ్యూస్ లు తాగితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందని తెలుసా…

ఈ జ్యూస్ లు తాగితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుందని తెలుసా…

8 months ago | 5 Views

ప్రస్తుతం మన జనరేషన్ వారు తప్పక తెలుసుకోవలసిన విషయం ఆరోగ్యమే మహాభాగ్యం. మనము తింటున్న ఆహారం అలవాట్లు వల్ల మన జీవనశైలి వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది అనేది మనం తప్పక అవును అనాల్సిన విషయం. ముఖ్యంగా ఎండాకాలం మనం తీసుకునే ఫుడ్ మనల్ని మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అయితే ఎండలో తినడం కన్నా ఎక్కువగా చూస్తూ తాగడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం.

మరి అలాంటి చూసిన తాగుతూ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవచ్చు అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే అవి అన్ని రకాల జ్యూసులు కాదు కొన్ని మాత్రమే.

మొదటిగా బీట్రూట్ జ్యూస్ మనకి చాలా మేలు చేస్తుంది.ఆక్సిజన్ లెవెల్స్‌ని పెంచే శక్తి బీట్‌రూట్‌కి ఉంది. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించే గుణం కూడా ఉంది. ఇది తాగడం వలన రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. 

ఇలా జ్యూస్ తాగ లేని వారు బీట్‌రూట్‌ను స్లైసెస్‌గా కట్ చేసుకుని పాల కూరను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్స్ చేసి సలాడ్‌గా తీసుకోవచ్చు. బీట్‌రూట్, పాలకూర, టమాట కలిపి మిక్స్ చేసి జ్యూస్‌గానూ తీసుకోవచ్చు.

అంతే కాక చర్మ సమస్యలు రాకుండా ఇది మేలు చేస్తుంది.ప్రతి రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొటిమలు వంటి సమస్యలకు మంచి రిజల్ట్ ఇస్తుంది. పచ్చి బీట్‌రూట్ జ్యూస్ తాగితే మంచిది. 


ఇక బీట్రూట్ జ్యూస్ కాకుండా  బొప్పాయి పండు రసం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే విటమిన్ సి.. చర్మంలోని మలినాలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తుంది. బోప్పాయి పండు తరచూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండి జీవిత ఆయుషు పెరుగుతుంది. 

నేరుగా బొప్పాయి ముక్కలు తినాలంటే కొంతమందికి సహించదు. ఇటువంటి వారు బొప్పియిని గుజ్జులా చేసుకుని అందులో కొంచెం బాదం పాలు, తేనె, క్యారెట్ ముక్కలు మిక్స్ చేసి జ్యూస్ చేసి తాగొచ్చు. లేదా సలాడ్‌లా చేసుకుని తీసుకోవచ్చు.

ఇక గుమ్మడికాయ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఇందులో ఉండే రిబోఫ్లేవిన్, నియాచిన్, బి6 లాంటివి బ్లడ్ సర్క్యులేషన్‌ను క్రమబద్ధీకరిస్తాయి. ఫలితంగా అజీర్తి సమస్యలు దరి చేరవు. జీర్ణం బాగా అవుతుంది. అంతేకాకా చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ముడతలు పడకుండా కాపాడతుంది. అందుకే వారానికి ఓ సారైనా గుమ్మడి కాయ జ్యూస్ తాగితే మంచిది. 

ఇంకా చదవండి : మైదాపిండి ఎక్కువ తింటున్నారా అయితే ఇది చదవడం మర్చిపోకండి. 

# Beetroot     # Papaya