ప్రభాస్‌ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది!?

ప్రభాస్‌ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది!?

13 days ago | 29 Views

గడిచిన కొన్నేళ్లల్లో ప్రభాస్‌ సరైన ప్రేమకథలో నటించలేదు. అన్ని యాక్షన్‌ తరహా చిత్రాలే. ఇప్పుడు ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం 'కల్కి 2898 ఎడి’, 'సలార్‌ 2’  'రాజాసాబ్‌’ చిత్రాలతోపాటు 'కన్నప్ప'లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. వీటితోపాటు ఓ లవ్‌స్టోరీ చేయడానికి ఆయన గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారు. హను రాఘవపూడి  దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌  పక్కాగా సిద్థమైనట్టు సమాచారం.

Prabhas AI Photos: ఫ్యాన్స్ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. నెట్టింట  డార్లింగ్ ఏఐ ఫొటోస్ అరాచకం.. - Telugu News | Pan india star Prabhas Movies  master plan for his fans Telugu Heroes Photos ...

ప్రేమ ప్రధానంగా సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్టు తెలిసింది .'సీతారామం’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కథానాయిక ఎంపిక పక్రియ జరుగుతోంది. మరో పక్క మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరుగుతున్నాయని సమాచారం. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న'కల్కి 2898 ఎ.డి’ జూన్‌ 27న విడుదల కానుంది.

ఇంకా చదవండి: "ప్రేమ్‌చంద్ మానవతావాదం ఎవరికైనా అర్థమయ్యే భాషను మాట్లాడుతుంది": వివాన్ షా

# Prabhas     # Kalki2898ad     # Salaar2     # Rajasab     # TeluguCinema    

trending