ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటిస్తున్న 'లవ్ మీ' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య నటిస్తున్న 'లవ్ మీ' విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

1 day ago | 47 Views

ఆశిష్ రెడ్డి యొక్క కొత్త హారర్ థ్రిల్లర్ చిత్రం 'లవ్ మీ'. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2024న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, ఇది చివరి నిమిషంలో వాయిదా పడిందని ఇప్పటికే వెల్లడించాము. ఇప్పుడు, లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, దిల్ రాజు నిర్మాతగ ఉన్న ఈ సినిమా ని మే 25, 2024న విడుదల చెయ్యటానికి లాక్ చేసారు. ఎందుకంటే ఆ సమయానికి ఐపీఎల్ అయిపోతుంది, ఏపీలో ఎన్నికల ఫీవర్ కూడా ముగిసిపోతుంది కాబట్టి. సినీనటుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో చేతులు కలపడంతో ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి.

ఏపీ ఎన్నికల కారణంగా లవ్ మీ వాయిదా పడింది

గెలుస్తాడనే ఉత్కంఠ నెలకొంది, ఇదంతా రాష్ట్రంలో డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేసింది, ఈ సమయంలో దిల్ రాజు తన సినిమాను విడుదల చేయకూడదని అనుకుంటున్నాడు. అందుకే లవ్ మీ కొత్త విడుదల తేదీని మే 25గా లాక్ చేసారు. 'బేబీ' మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు . ఈ సినిమా ఆడియో లాంచ్ గ్రాండ్ గా జరిగినా దానికి రెస్పాన్స్ మాత్రం అంతగా రాలేదు. అయితె ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు చివరి నిమిషంలో వెనక్కి తగ్గి రిలీజ్ ప్లాన్ ను మార్చేశారు. 

ఆశిష్‌రెడ్డి, వైష్ణవి చైతన్య కెరీర్‌లో ఇద్దరికి 'లవ్‌ మీ' రెండో సినిమా కావడం విశేషం. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు కూతురు హన్షితారెడ్డి, హర్షిత్‌ రెడ్డి నిర్మాతలుగా ఉన్నారు. లవ్‌ మీ రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అనే భావనను ఈ సినిమా టీజర్‌ గలిగించింది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్ అందించారు. దిల్ రాజు బృందం ఈ కొత్త కాన్సెప్ట్ ని చిత్రాంచడం ఇదే మొదటిసారి, అందుకే అతను విడుదలతో ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని మరియు సరైన విడుదల తేదిని రిలీజ్ చేశారు. 

ఇంకా చదవండి: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ చేతుల మీదగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ విడుదల

# LoveMe     # DilRaju     # AshishReddy     # VaishnaviChaitanya