మైదాపిండి ఎక్కువ తింటున్నారా అయితే ఇది చదవడం మర్చిపోకండి.

మైదాపిండి ఎక్కువ తింటున్నారా అయితే ఇది చదవడం మర్చిపోకండి.

8 months ago | 5 Views

గోధుమ పిండిని మైదాపిండిగా మార్చే క్రమంలో పోషకాలు అన్నీ తొలగించబడతాయి. ప్రాసెసింగ్ చేసే క్రమంలో మైదాపిండి లోకి రసాయనాలు వచ్చి చేరతాయి కాబట్టి దీనితో చేసిన ఆహార పదార్ధాలు తినటం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. 

అయితే ఈ రోజుల్లో మైదా వాడకం ఎక్కువైంది. మార్కెట్లో ఏ ఆహార పదార్థాలు కొనాలన్నా.. మైదా పిండిలేనిది ఉండట్లేదు. బిస్కెట్లు, బ్రెడ్డు, పఫ్‌లు, రోల్స్‌, పిజ్జా, సమోసా ఇలా ఏది చూసినా మైదాతోనే తయారు చేస్తుంటారు. 

అయితే మైదా తింటే కడుపు నిండిన భావన మాత్రమే కలుగుతుంది. అంతేకాకుండా బరువు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మైదా పిండి రక్తంలో చక్కెర స్ధాయిలు పెరగటానికి కారణమౌతుంది. అంతేకాకుండా మైదా తో తయారైన ఆహారపదార్ధాల్లో అధిక నూనె వినియోగం వల్ల శరీరంలో చెడు కొవ్వులు పెరిగే ప్రమాదం ఉంటుంది. తద్వారా గుండె సంబంధిత సమ్యలు వస్తాయి. 

మైదాలో ఎలాంటి పోషకాలు ఉండవు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. గోధమ పిండిలో ఫైబర్, విటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. రిఫైన్‌ చేసిన పిండిలో ఈ పోషకాలు ఉండవు, ఫైబర్‌ కంటెంట్‌ కూడా సున్నా ఉంటుంది. మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటే.. అనారోగ్య ప్రమాదాలు తప్పవని నిపుణులు అంటున్నారు. 

ఈ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువ. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే శరీరానికి పీచు పదార్థాలు తప్పనిసరిగా అందించాలి. కానీ మైదాపిండిలో పీచు పదార్థం ఉండదు. కనుక ఇది తొందరగా జీర్ణం కాదు. పేగులలో పేరుకుపోయి పేగుల్లో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

అంటే కాదు మధుమేహులు మైదాతో తయారు చేసిన ఆహారపదార్ధాలను తినకుండా ఉండటం మంచిది. ఆమ్లత్వం కలిగిన మైదాపిండి ఆహారాలు ఎముకలకు హాని కలిగిస్తాయి. 

ఇంకా చదవండి : నిద్ర పట్టకపోతే మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలు జోడించాల్సిందే. 

# Maida