మిరియాల పొడిని ఇలా వాడండి.. కీళ్ల నొప్పులు, మధుమేహం మీ దగ్గరకు రావు

మిరియాల పొడిని ఇలా వాడండి.. కీళ్ల నొప్పులు, మధుమేహం మీ దగ్గరకు రావు

9 months ago | 5 Views

ప్రస్తుతం ఎంతోమంది ఎదురుకుంటున్న సమస్యలు కీళ్ల నొప్పులు, మధుమేహం. వీటిని పూర్తిగా నివారించడం ఎలా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అయితే చిన్న చిట్కాతో ఇవి దగ్గరకు రాకుండా చేసుకోవచ్చట. అది ఎలాగో ఒకసారి చూద్దాం..

పూర్వకాలంలో వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూతలు, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులుగా వంటల్లో మిరియాల పొడి, పచ్చి కారాన్ని వాడడమే మంచిదని వారు చెబుతున్నారు..వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు ఎంతగానో సహాయపడతాయి..

ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని, మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. ఇక మనకు దగ్గు తగ్గుతుంది. 

అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు ఎంతగానో సహాయపడతాయి..

మరి ఇంకెందుకు ఆదర్శం మిరియాలతో ఇన్ని ప్రయోగాలు ఉండగా, వాటిని మనం ఎందుకు దూరం పెట్టడం. 

ఇంకా చదవండి : RO వాటర్ ఎక్కువగా తాగుతుంటే. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. 

# Black Pepper