నిద్ర పట్టకపోతే మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలు జోడించాల్సిందే.

నిద్ర పట్టకపోతే మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలు జోడించాల్సిందే.

8 months ago | 7 Views

ఈమధ్య చాలామంది బాధపడుతున్న సమస్య నిద్ర లేకపోవడం. సరైన నిద్ర లేకపోతే రోజంతా ప్రశాంతతను కోల్పోతాము. అందుకే మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. కానీ ప్రస్తుత జీవన శైలి, స్ట్రెస్ వల్ల చాలామంది తమకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు.

అయితే నిద్ర పట్టని వారు ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు జోడిస్తే చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 

కివీ పండ్లు: చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే తిండ్లు కివి. వీటిలో ఎక్కువగా సెరటోనిన్ మన శరీరంలో మెలటోనిన్ అనే ఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది.

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర బాగా రావడానికి తోడ్పడుతుంది.

గోరు వెచ్చటి పాలు : గోరు వెచ్చటి పాలని రాత్రి పూట తీసుకుంటే నిద్ర యొక్క నాణ్యత బాగా పెరుగుతుంది. అలానే నిద్ర బాగా పడుతుంది. పాలని నిద్రపోయేటప్పుడు తీసుకుంటే మెలటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాసు గోరు వెచ్చటి పాలు తీసుకోండి. దీనితో నిద్ర బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది. 


టార్ట్‌ చెర్రీలు : మనలో మంచి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ హర్మోన్‌ ఉత్పత్తిని పెంచే లక్షణం టార్ట్‌ చెర్రీలలో ఉందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట భోజనంలో భాగంగా టార్ట్‌ చెర్రీలను తీసుకోవడం వల్ల మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి.. మంచి నిద్రకు శరీరం సిద్ధమవుతుందని వివరిస్తున్నారు. వీటిని నేరుగా తినలేకపోతే జ్యూస్‌ చేసుకుని తాగవచ్చని సూచిస్తున్నారు.

సాల్మన్ చేప : సాల్మన్ చేపను పుడ్ లో చేర్చండి.. ఇవి సిరొటోనిన్‌ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది శరీరానికి నిద్రను వచ్చేలా చేస్తుంది. టార్ట్‌ చెర్రి తీసుకోవడం శరీరానికి నిద్ర పోయేలా చేస్తుంది. రాత్రి భోజన సమయంలో ఈ పండు లేదా జ్యూస్‌ తీసుకోవాలి. సూక్ష్మపోషకాంశాలను కలిగి ఉన్న కొన్ని ఆహార పదార్ధాలు నిద్రపై తగినంత ప్రభావం చూపుతాయి.

సాధారణంగా మంచి ఆహారంతో పాటు జీవనశైలి చాలా ముఖ్యం. స్క్రీన్‌టైమ్‌ నియంత్రణ, నిద్రించే వాతావరణం, ఉష్ణోగ్రతలు పడుకునేముందు చూసుకోవాలి. 

ఇంకా చదవండి : మిరియాల పొడిని ఇలా వాడండి.. కీళ్ల నొప్పులు, మధుమేహం మీ దగ్గరకు రావు 

# Kiwi Fruit     # Pumpkin seeds