'ఆంధ్రా కింగ్ తాలూకా' రివ్యూ :  రామ్‌ వన్‌మ్యాన్‌ షో!

'ఆంధ్రా కింగ్ తాలూకా' రివ్యూ : రామ్‌ వన్‌మ్యాన్‌ షో!

7 days ago | 5 Views

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హిట్టు కొట్టి దాదాపు ఆరేళ్లు కావస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేసి కెరీర్ లో  వెనక్కి వెళ్లిన రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో మళ్లీ తన జోనర్ క్లాస్ టచ్‌లోకి వచ్చాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ డైరెక్టర్ పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై  భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన  ఈ చిత్రంలో  భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్‌ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రామ్ పోతినేనితో పాటు వరుసగా మూడు పరాజయాలు చవిచూసిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’పై భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ ఇద్దరూ కోరుకునే  సక్సెస్‌ని ఈ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఇచ్చిందా? లేదా?   ఈ సినిమాతో  రామ్ పోతినేనికి కమ్‌బ్యాక్ హిట్ దక్కిందా? లేదా? సమీక్షలో తెలుసుకుందాం.. 

కథ :  టెక్నాలజీ, సోషల్ మీడియా ఇంకా విస్తరించని 2002లో కథ ఇది.  ‘ఆంధ్రా కింగ్’గా పిలుచుకునే  హీరో సూర్యకుమార్ (ఉపేంద్ర), వీరాభిమాని సాగర్ (రామ్)..  థియేటర్ ఓనర్ కూతురు మహా లక్ష్మీ (భాగ్యశ్రీ బోర్సే)ని ప్రేమిస్తాడు. అయితే మహాలక్ష్మీ తండ్రి (మురళీ శర్మ), సాగర్‌ని, అతన్ని పిచ్చి అభిమానాన్ని చాలా చులకనగా మాట్లాడతాడు. ఇదే సమయంలో సాగర్ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తన అభిమాన హీరో సూర్యకుమార్‌ని కలుసుకోవాలని సాగర్ బయలుదేరతాడు. అసలు సూర్యకుమార్‌ని కలుసుకోవాలని సాగర్  ఎందుకు అనుకున్నాడు? సాగర్‌కి వచ్చిన కష్టం ఏంటి? అతని ప్రేమ కథ, సక్సెస్ అయ్యిందా? సాగర్‌, సూర్యకుమార్‌ని కలుసుకోగలిగాడా? తెలియాలంటే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా చూడాల్సిందే...


విశ్లేషణ :  ఈ సినిమా ఒక వీరాభిమాని కథ ఇది. రామ్ పోతినేని సాగర్  అనే ఒక వీరాభిమానిగా నటించాడు.  తను అభిమానించే హీరో కోసం ఎంతవరకైనా వెళ్లే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఇది.  ఒక హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథ కావడంతో  జనాలకు కాస్త ఎంటర్‌టైన్ చేసేలా ఎంతో కొంత డ్రామా ఉండాలి.  ఆ డ్రామను దర్శకుడు సరైన విధంగా తెరకెక్కించాడు.  ఆంధ్రకింగ్‌ ఊహించదగ్గ ఫ్యానిజమ్‌, లవ్‌స్టోరీ. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతిని కలిగిస్తుంది.  ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే మధ్య కెమిస్ట్రీ టెర్రిఫిక్‌గా ఉంది.  దర్శకుడు మహేశ్‌ మరో మంచి హార్ట్‌ఫుల్‌ డ్రామాని తెరకెక్కించాడు. రామ్‌ నటన అదిరిపోయింది. సినిమాలో హీరో పాత్రకి ఉపేంద్రని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అద్భుతంగా నటించాడు. ఊహకందేలా ఉన్నప్పటికీ..చాలా నిజాయితీగా  ఈ కథను చెప్పారు.   ప్రతి హీరో అభిమాని ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతాడు. సెకండాఫ్‌ అద్భుతంగా ఉంటుంది.  ఎమోషనల్‌ అండ్‌ ఎంగేజింగ్‌ మూవీ ఇది. రామ్‌ తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టాడు. డైలాగులు బాగున్నాయి. పాటలు, సెంకడాఫ్‌ బ్యూటిఫుల్‌గా ఉంది. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగడం కొంత మైనస్‌ అయినప్పటికీ  ఓవరాల్‌గా ఆంధ్రకింగ్‌  బాగుందనిపిస్తుంది.  మరీ ముఖ్యంగా హీరో ఫాదర్ రోల్‌కు మనం చాలా కనెక్ట్ అయిపోతాం. ఇక ఉపేంద్ర రోల్ అయితే స్టాండౌట్ మూమెంట్.  ఆయన స్క్రీన్‌పై కనిపించిన సేపు ఒక మంచి హై ఫీలింగ్ కలుగుతుంది.  ఇక విలేజ్ సీన్లతో పాటు టెంపుల్ సీన్ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది.  ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్‌గా ఉన్నాయి.  ఓ క్యూట్ లవ్ స్టోరీకి హీరోకి, అభిమానికీ  మధ్య లింకు పెట్టి కథను రాసుకున్నాడు డైరెక్టర్ పి. మహేష్ బాబు. కథకు అవసరం లేని సన్నివేశాలు, కామెడీ లేకుండా కథపైనే కథనాన్ని సాగించాడు. ఫస్టాఫ్ సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతుందో చాలా మంది ప్రేక్షకులు ముందుగానే ఊహించగలుగుతారు. అయితే సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత మహేష్, మరోసారి గుండెని హత్తుకునే సన్నివేశాలు రాయగలిగాడు. రామ్ పోతినేని, కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో దుమ్మురేపాడు. గత కొన్ని సినిమాలుగా ఆయనలో మిస్ అయిన చాక్లెట్ బాయ్‌ లుక్స్‌ని మళ్లీ పరిచయం చేశాడు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో మెప్పించింది. రామ్ - భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ బాగుంది. హీరో సూర్యకుమార్‌ క్యారెక్టర్‌లో ఉపేంద్ర బాగా సెట్ అయ్యారు. రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, హర్షవర్థన్, రాజీవ్ కనకాల తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.  ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీకి మరో ప్లస్ పాయింట్ ప్రెష్ మ్యూజిక్. వివేక్ - మెర్విన్ సంగీతం ఇచ్చిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా రిచ్‌గా ఉన్నాయి. కొంతమందికి లెంగ్త్ ఎక్కువైనట్టుగా అనిపించినా, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హీరో కోసం కుటుంబాన్ని, తన సొంత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా కొట్టుకునే వెర్రి అభిమానులకు ఈ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కచ్ఛితంగా కనెక్ట్ అవుతుంది.

 రేటింగ్ : 3.5/5

ఇంకా చదవండి: డైరెక్టర్ శేఖర్ కమ్ముల క్లాప్ తో '16 రోజుల పండగ' మూవీ గ్రాండ్ గా లాంచ్  

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఆంధ్రా కింగ్ తాలూకా     # రామ్ పోతినేని    

trending

View More