'అఖండ 2'మూవీ రివ్యూ : చూడాల్సింది బాలయ్య విధ్వంసం మాత్రమే!
5 hours ago | 5 Views
కొన్ని కాంబినేషన్ లకి సినిమాలకి కథ..కథనం..ఎమోషన్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబో బాలయ్య-బోయపాటి. వీరి కాంబినేషన్ అంటే హిట్ గ్యారెంటీ అని అభిమానులు నమ్ముతారు. సింహా, లెజెండ్, అఖండ ఇలా వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 'అఖండ’ తొలిభాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అఘోరగా బాలకృష్ణ నటన, తమన్ సంగీతం, బోయపాటి టేకింగ్ ఆ సినిమాను విజయ పథంలో నడిపాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన నాలుగో చిత్రం 'అఖండ 2: తాండవం'. పైగా ఇది 'అఖండ' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. దీనితో ఈ చిత్రంపై నందమూరి అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంయుక్త మీనన్ హీరోయిన్ గా.. 'భజరంగీ భాయీజాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. 14 రీల్స్ పల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట-గోపి ఆచంట నిర్మించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఆ సమస్యలని దాటుకుని ఈ శుక్రవారం (డిసెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి 'అఖండ 2' అభిమానుల అంచనాలని అందుకుందా ? అఘోరగా బాలకృష్ణ ఎవరిపై యుద్ధం చేశారు? బాలయ్య తాండవం ప్రేక్షకులని మెప్పించిందా? అనేది తెలుసుకుందాం...
కథ : చైనా టిబెట్ బార్డర్ లో కథ మొదలవుతుంది. చైనా ఆర్మీలో ఉండే ఓ కమాండర్ కి ఇండియా అంటే విపరీతమైన ద్వేషం. ఇండియా-చైనా మధ్య బోర్డర్ వార్ అనేది పతాక స్థాయికి చేరుకుని, శత్రుదేశం ఏకంగా భారతదేశ మూలాలను నాశనం చేసేందుకు పూనుకుంటుంది. ప్రధాని పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత సహాయంతో చైనా కమాండర్ ఇండియాని విచ్ఛిన్నం చేయాలనుకుంటాడు. దీనితో ఇండియాపై బయో వార్ పథకం రచిస్తారు. 'అఖండ' తొలి భాగానికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా ఇది. ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు 17, 18 సంవత్సరాల తరువాత ఈ కథ జరుగుతుంది. ఊరిలో ఉండే అఖండ సోదరుడి (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా చేరుతుంది. అక్కడ ట్రైనింగ్‌లో ఉండగా, భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ ఎటాక్ అవుతుంది. తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిసిన జనని, తన మెంటార్ (సంయుక్త మీనన్)తో కలిసి దాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఆ వైరస్ మొత్తాన్ని భారతీయులందరిలో ఎక్కించాలని దురుద్దేశంతో ఉన్న ఠాగూర్ (కబీర్ దుల్హన్ సింగ్) యాంటిడోడ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే శివారాధనలో ఉన్న అఖండ శిఖందర్ రుద్ర (బాలకృష్ణ), జనని ఆపదలో ఉందని తెలుసుకుని ఆమెకి ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. అఖండ ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు కుంభమేళా గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక ఎవరు ఉన్నారు? ఈ విషయం తెలిసిన అఖండ వారి కుట్రలని ఎలా అడ్డుకున్నాడు? ఆ మానవ ప్రేరేపిత ప్రళయం నుండి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, ప్రజల్ని ఎలా కాపాడాడు? ఇందులో నేత్ర (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి? అనేది కథాంశం.

విశ్లేషణ: బోయపాటి సినిమాల్లో కథ కంటే ఆయన డెలివర్ చేసే మాస్ మూమెంట్స్ ని అభిమానులు, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. మాస్ యాక్షన్ సీన్స్, సాంగ్స్, డైలాగులు పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటారు. బాలయ్యతో సినిమా అంటే ఆ డోస్ ని బోయపాటి ఇంకాస్త పెంచుతారు. 'అఖండ 2'లో కూడా బోయపాటి అదే ప్రయత్నం చేశారు
లాజికల్ గా చూసి జడ్జ్ చేసే సినిమా కాదు ఇది. బుర్రలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా.. ఓ రెండున్నర గంటలపాటు బాలయ్య విధ్వంసం చూడాల్సిందే.. అఖండ మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు, కాబట్టి ఆ సినిమా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. అయితే ఆ సినిమా బరువు అంతా ఇప్పుడు అఖండ సెకండ్ పార్ట్ మీద పడింది. దానికి తోడు బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ అనగానే వచ్చే అంచనాలు కూడా దీనికి తోడయ్యాయి. ఇక సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ ముందు వరకు పెద్దగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అంశాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడి వరకు సినిమాని గ్యాప్ ఫిల్లింగ్ కోసమే వాడుకున్నట్లు అనిపించింది. చిన్నారి పాప పెద్దగా అవ్వడం, తర్వాత సెకండ్ హాఫ్‌లో మెయిన్ కాన్సెప్ట్ కోసం కొన్ని పరిణామాలు జరగడం వంటివి చూపిస్తారు. అయితే అవి ఏవీ ప్రేక్షకులకు ఎంగేజింగ్‌గా అనిపించవు. ఎప్పుడైతే అఖండ ఎంట్రీ ఉంటుందో, అక్కడి నుంచి సినిమా ఒక్కసారిగా పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బాలకృష్ణని అఖండ పాత్రలో బోయపాటి ప్రజెంట్ చేసిన విధానం బావుంది. కానీ బోయపాటి తన స్ట్రెంత్ కి తగ్గట్లు మాస్ మూమెంట్స్ ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సీన్ తప్ప మిగిలినవి వర్కౌట్ కాలేదు. దీనికితోడు బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ లో కనిపించింది చాలా తక్కువ. ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం.. ఇది కదా బాలకృష్ణ, బోయపాటి సినిమా అంటే అని అనిపించేలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కటీ వర్కౌట్ కావడం వల్ల ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నిలిచింది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని మాస్ సీన్స్, తల్లి సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు పండాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు దైవత్వం, సనాతన ధర్మంపై రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనితో ఆడియన్స్ సెకండ్ హాఫ్ ని సనాతన ధర్మం గురించి చెప్పే క్లాస్ లాగా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ లో బాలయ్య హనుమంతుడి తరహాలో చేసే ఫైట్ సీన్, ఆది పినిశెట్టి తంత్ర విద్యలకు సంబంధించిన సన్నివేశాలు కొంతవరకు మెప్పిస్తాయి. అదే సమయంలో ఎలివేషన్స్ కోసమే రాసుకుని హడావిడి చేసిన సీన్లు కూడా ఉంటాయి. బలవంతంగా పెట్టిన ఎలివేషన్స్ తో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. సీన్లు రాసుకున్న విధానం ఆకట్టుకోదు. కానీ బాలయ్య మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. ఆది పినిశెట్టి పాత్ర అంత బలంగా లేదు. అసలు ఈ సినిమాలో బలమైన విలన్ సెటప్ అంటూ ఉండదు. చైనానే విలన్ గా చూపించేశారు. ముఖ్యంగా అఖండ ప్రీ-ఇంటర్వెల్ ఫైట్ అయితే అస్సలు ఒక రేంజ్‌లో వర్కౌట్ అయింది. ప్రేక్షకులందరూ ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తరువాత మళ్లీ కథ నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథ పెద్దగా లేకపోవడంతో ప్యూర్ బాలకృష్ణ మార్క్ డివోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు బోయపాటి మార్క్ ఫైట్స్ నింపేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తం మీద కథ సింపుల్‌గా ఉంటుంది, కానీ అఖండగా బాలకృష్ణకు ఇచ్చే ఎలివేషన్స్‌తో పాటు కొన్ని ఫైట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.
కథ లేకపోయినా కేవలం ఎలివేషన్ ఫైట్స్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా నడిపించడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. అయితే రెగ్యులర్ సినిమా లవర్స్‌కి ఈ సినిమా కాస్త లాగ్ అనిపించవచ్చు, కానీ మాస్ ఆడియన్స్‌తో పాటు బాలకృష్ణ ఫ్యాన్స్ విపరీతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సినిమా ఫస్టాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపైన కనిపిస్తాడు తప్పా.. బాలకృష్ణ చేసేది ఏమీ ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియెన్స్ కోసం ఫైట్, పాటతో సరిపెట్టుకొనే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా, టిబెట్, మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతుందా? అనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపైన విధ్వంసం సృష్టించారు. ఇంతకుమించి సినిమాలో చెప్పుకొనే కొత్త విషయం ఏమీ ఉండదు. ఇక సెకండాఫ్‌లో మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్‌గా, రెగ్యులర్‌గా సాగిపోతాయి. ఆది పినిశెట్టి ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ, ఆది పినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండటమే కాకుండా ఈ సినిమాకు ఇది అవసరమా? అనే అనుమానం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మం బోదనలతో బోయపాటి శ్రీను విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఈ సినిమా ఊహకు అందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది. ఈసారి కథని సరిహద్దులు దాటించారు దర్శకుడు బోయపాటి. అఘోరా పాత్రకు మరింత డోస్ పెంచి బాలకృష్ణతో సర్జికల్ స్ట్రైక్ చేయించారు. సనాతన ధర్మం, భారతీయుల నమ్మకాలు, వేదజ్ఞానాల గొప్పతనాన్ని అఘోరా పాత్రలోని బాలకృష్ణతో చెప్పిస్తూ సినిమాని నడిపించారు. మాస్ హీరోల్ని చూపించడంలో బోయపాటి శైలే వేరు. ఆయనకు బాలకృష్ణ తోడయ్యారంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోరు. శివుడు పూనిన అఖండ పాత్ర కావడంతో బోయపాటి శ్రీను తనలోని మాస్ ఎలివేషన్లు మరింత పదునెక్కాయి. అయినా అక్కడ అఖండ పాత్ర కావడంతో నమ్మాల్సిందే అన్నట్టుగా ఉంటాయి ఆ సన్నివేశాలు. ఒకపక్క యాక్షన్... మరోవైపు పదునైన సంభాషణలతో సినిమాని నడిపించిన తీరు మెప్పిస్తుంది. అఖండ రీక్యాప్‌తో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి టిబెట్ సరిహద్దుల దగ్గర సంఘర్షణ.. దేవుడిపై భారతీయులకు ఉండే నమ్మకంపైన దెబ్బ కొట్టాలని శత్రుదేశమైన చైనా పన్నాగం పన్నడం కోసం ఎలాంటి వ్యూహాల్ని రచించారు అన్నది సినిమాలో కీలకం. దీంతో ఎక్కువశాతం ‘అఖండ’ టెంప్లేట్‌లోనే సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) ఎపిసోడ్ అంతా అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. తొలి భాగంలో ఫ్యాక్షనిస్టులపై యుద్ధం చేస్తాడు మరో బాలకృష్ణ. ఇందులోనేమో మత్తు మందుల్ని సరఫరా చేసే అంతర్రాష్ట్ర ముఠాపై సమర శంఖం పూరిస్తాడు. బాలమురళీకృష్ణ పరిచయ సన్నివేశాలు, ఎలివేషన్లు మాస్ ప్రేక్షకులకు పండగే. ఆ తర్వాత సన్నివేశాలే కాస్త సాగదీతగా అనిపిస్తాయి. విరామానికి ముందు ఎపిసోడ్‌తో సినిమా మళ్లీ గాడిలో పడుతుంది. అఘోరా ప్రవేశంతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత హైలైట్. బాలయ్య అసలు సిసలు తాండవం విరామం తర్వాతే మొదలు పెడతాడు. అఘోరా పాత్రలోని రెండు కోణాలూ తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తాయి. తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొదలుకొని హనుమాన్, శివుడు ఎపిసోడ్స్ సహా తల్లి సెంటిమెంట్, దేశభక్తి, హైందవధర్మం నేపథ్యం వరకూ దాదాపుగా ప్రతీ సన్నివేశం రోమాంచితమే. ముఖ్యంగా తల్లి దగ్గర సన్నివేశాల్లో మలుపు భక్తిని, భావోద్వేగాల్ని పంచుతుంది. సర్జికల్ స్ట్రైక్ అంటూ సరిహద్దుల్లో శత్రుసైన్యంతో తలపడే సన్నివేశాలు, వేదభూమి అయిన భారతదేశం గొప్పతనం గురించి చెప్పే సన్నివేశాలు సినిమాకి ప్రధానబలం. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహా అటు భావోద్వేగాల పరంగానూ, ఇటు అభిమానుల్ని మెప్పించే ఎలివేషన్లు, మాస్ అంశాల పరంగానూ ఈ సినిమా మెప్పిస్తుంది. ప్రధానమంత్రి పాత్ర, చైనా నేపథ్యం సహా చాలా పాత్రలు, సంభాషణలు రాజకీయ కోణాల్నీ స్పృశించినట్టు అనిపిస్తాయి. కొన్ని సినిమాలకు లాజిక్స్ తో అసలు పనిలేదు.. జస్ట్ స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్ చూసి ఎంజాయ్ చేయాలంతే. అఖండ తాండవం అలాంటి సినిమానే. కథతో పనిలేదు.. కథనంతో అవసరం లేదు.. జస్ట్ స్క్రీన్ మీద అలా బాలయ్య త్రిశూలం తిప్పుతూ వస్తే చాలు.. మీరు పెట్టిన డబ్బులకు పైసా వసూల్ అయిపోయినట్టే..! కరెక్ట్ టైంలో బయట నడుస్తున్న ట్రెండ్ పట్టుకొని సనాతన హైందవ ధర్మం గురించి చెప్పాడు బోయపాటి. అది కూడా అందరికీ అర్థమయ్యేలా కమర్షియల్ అంశాలు జోడించి బుర్రలోకి బాగా ఎక్కించాడు. సినిమా అంతా దేవుడు చుట్టూనే జరిగింది. ఇంటర్వెల్ కు తాండవం మొదలుపెట్టిన బాలయ్య క్లైమాక్స్ వరకు ఆపలేదు. చూడ్డానికి రొటీన్ కథలాగే అనిపించినా కూడా ఇందులో మూలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం గురించి చెప్పిన సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా దేవుడు లేడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కనిపించడు లాంటి ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానం చెప్పించాడు బోయపాటి.
నటీనటుల పనితీరు: బాలకృష్ణ అఖండగా అఘోర పాత్రలో, ఎమ్మెల్యేగా బాలమురళీ కృష్ణ పాత్రలో ద్విపాత్రాభినయం చేశారు. అఖండ రుద్ర పాత్రలో నట విశ్వరూపం ప్రదర్శించారు. బాలయ్య పోషించిన రెండు క్యారెక్టర్స్ లో అఖండ సింహభాగం తీసుకోగా.. ఎమ్మెలే బాలమురళీ కృష్ణ అనే క్యారెక్టర్ మాత్రం సరిగ్గా వర్కవుట్ అవ్వలేదు. ఆ పాత్రకి ప్రాముఖ్యత తక్కువ. అఖండగా మాత్రం బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సనాతనధర్మం గురించి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్టాఫ్‌లో బాలకృష్ణ రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించదు. సెకండాఫ్‌లో కొంత మేరకు ఎలివేషన్స్‌తో మాస్ ఆడియెన్స్‌లో జోష్ పుట్టిస్తాడు. కానీ అది కూడా కొంత సేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్‌లో కనిపిస్తుంది. బాలకృష్ణ వన్ మేన్ షో అనిపిస్తుందీ చిత్రం. బాలకృష్ణకి మాత్రమే సాధ్యం అనిపించేలా సంభాషణలు చెప్పారు. యాక్షన్ ఘట్టాలతోనూ మెప్పించారు. ముఖ్యంగా విరామానికి ముందు సన్నివేశాల్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరింతగా ప్రభావం చూపిస్తుంది. బాలయ్య మరోసారి తన రుద్ర తాండవం చూపించాడు. అఖండ పాత్రలో ఆయన నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అఖండ పాత్ర చూస్తున్న ప్రతిసారి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. కనిపిస్తున్న ప్రతిసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మిగతా పాత్రధారులు ఎవరిని చూడకుండా చేయడంలో బాలయ్య సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన లుక్, గడ్డం సహా వస్త్రధారణ ఇలా ప్రతి విషయంలో తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్ అయ్యాయి. కథానాయిక సంయుక్త పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. జాజికాయ పాత్రలో మెరిసిందంతే. చాలా చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ.. ఎందుకో ఆమె ఈ సినిమాలో కానీ, ఉన్న ఒక్క పాటలో కానీ ఇమడలేకపోయింది. అఖండలో ప్రగ్యా జైస్వాల్ కి దక్కిన ప్రాముఖ్యత ఇందులో సంయుక్తకి దక్కలేదు. ఒక సాంగ్, యాక్షన్ సీన్ కోసమే ఆమె పాత్ర అన్నట్లుగా ఉంటుంది. ఆమె రోల్‌కు ఏ మాత్రం ప్రాధాన్యం ఉండదు. మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే అవకాశమే కనిపించదు.
మరో కీలకమైన జనని పాత్రలో నటించిన 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలి లిప్ సింక్ ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా హిందీలో లేదా నెంబర్లు లెక్కపెట్టుకుంటూ వెళ్లిపోవడం అనేది మైనస్ గా మారింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. డబ్బింగ్ వాయిస్ సెట్ అవ్వక, లిప్ సింక్ లేక ఓ బార్బీ బొమ్మలా మిన్నకుండిపోయింది. ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్ సింగ్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. విజి చంద్రశేఖర్ పోషించిన తల్లి పాత్ర, ఆ నేపథ్యంలో పండిన సెంటిమెంట్ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. ప్రతినాయక పాత్రల్లో బలం లేదు. ఉన్నంతలో ఆది పోషించిన నేత్ర పాత్రే ప్రభావం చూపించింది. సినిమాలో విలన్ ఉన్నాడు అన్న పేరుకే కానీ.. ఆది పినిశెట్టి ఉన్నాడు అనే విషయం సెకండాఫ్ లో సడన్ గా కనిపించేంతవరకు తెలియలేదు. పాపం రెండు ఫైట్ల తర్వాత అతడి పాత్రను ముగించేయడం వల్ల సినిమాలో అతను విలన్ అనే భావన ఇవ్వలేకపోయింది. ఆది పినిశెట్టిని బోయపాటి సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. తాంత్రికుడిగా ఆది పాత్రలో హడావిడి మాత్రమే ఉంటుంది. పవర్ కనిపించదు. ఆయన నటించిన సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఉంటాయి. రావడం డైలాగులు చెప్పడం, హీరో చేతిలో దెబ్బలు తినడం అన్నట్లుగా ఉంటుంది అతడి పాత్ర. మురళీమోహన్, కబీర్ దుహాన్ సింగ్, కల్కి ఫేమ్ శాశ్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పూర్ణ, మురళి మోహన్, ఝాన్సీ ఇతర పాత్రల్లో మెప్పించారు. ఇక దేశాలు దాటిన విలనిజం కూడా ఎందుకో సరిగా వర్కవుట్ అవ్వలేదు. శివుడి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరో కానీ చాలా బాగా చేశారు. అయితే అక్కడ ఏఐలో సీనియర్ ఎన్టీఆర్ ను తీసుకొస్తారని ప్రచారం జరిగింది, అదే కనుక చేయగలిగి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సాంకేతికవర్గం పనితీరు: అఖండ మొదటి భాగానికి తన సంగీతంతో ప్లస్ పాయింట్ గా నిలిచిన తమన్ సెకండ్ పార్ట్ కి అదే స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. ట్రాన్స్ బీజీయం బాగున్నా.. కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ రిపీట్ అయిపోయింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్ ను విడిగా చూస్తే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. అయితే.. సినిమా తాలూకు ఎమోషన్ లో మాత్రం మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే ఓ రెండు ఫైట్లు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. బాలయ్య కంఫర్ట్ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ఎప్పట్లానే బాలయ్యని బాగా చూపించారు. ఫైట్ సీన్స్ ను బాగా మ్యానేజ్ చేసారు. దర్శకుడు బోయపాటి సినిమాల్లో మామూలుగానే ఫైట్ సీన్స్ లో లాజిక్స్, యాక్షన్ లో సెన్సిబిలిటీస్ కనిపించవు. ఇక ఈ సినిమాలో హీరో దాదాపుగా దేవుడు లాంటోడు కావడంతో బోయపాటి క్రియేటివిటీకి అడ్డు లేకుండాపోయింది. అయితే.. శివుడు, హనుమంతుడు వంటి డివోషనల్ ఎలిమెంట్స్ ను సినిమా కోసం వినియోగించుకున్న విధానం బాగుంది. కాకపోతే.. అఖండ 2లో ఒక కోర్ పాయింట్ .. స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వల్ల యాక్షన్ సీన్స్ మినహా మిగతా సినిమాని మొదటి భాగం స్థాయిలో ఆస్వాదించలేకపోయాం. కామెడీ సీన్స్ విషయంలో బోయపాటి వీక్ అనేది ఈ సినిమాలో కామెడీ సీన్స్..పంచులు మరోసారి ప్రూవ్ చేస్తాయి. అయితే.. ఆడియన్స్ కు ఇవన్నీ ఆలోచించే టైమ్ ఇవ్వకుండా.. వరుసబెట్టి ఎలివేషన్స్, ఫైట్స్ తో సినిమాని హరి రేంజ్ లో పరిగెట్టించి ప్రేక్షకులు పెద్దగా బోర్ ఫీలవ్వకుండా చేయగలిగాడు బోయపాటి. అందువల్ల 'అఖండ 2' బోయపాటి బెస్ట్ వర్క్ అని చెప్పలేం కానీ.. దర్శకుడిగా, కథకుడిగా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు అనైతే చెప్పొచ్చు. సనాతన ధర్మం, దేవుళ్ళ గురించి పవర్ ఫుల్ గా ప్రవచనాలు చెప్పడం, క్లాస్ పీకడం కోసమే బోయపాటి కథ రాసుకున్నట్లు ఉంటుంది. కొన్ని డైలాగులు మాత్రం వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ కొరియోగ్రఫీ బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఉంది. కానీ కొన్ని సన్నివేశాల్లో శ్రుతి మించింది. సంగీతం విషయానికి వస్తే అఖండ సక్సెస్ అయింది కాబట్టి తమన్ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. అదే టెంపోలో లౌడ్ బిజీయం ఇచ్చారు. కొన్ని చోట్ల తమన్ సంగీతం సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసేలా ఉంటుంది. కానీ చాలా చోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువై చిరాకుగా అనిపిస్తుంది. సి రాంప్రసాద్, సంతోష్ డి కెమెరా పనితనం బావుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు. సినిమా మొత్తానికి బాలయ్య హీరో అయితే, టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే తమన్ హీరో. తనదైన సంగీతంతో పాటు నేపథ్య సంగీతంతో సినిమాని నడిపించాడు. నిజానికి కొన్నిచోట్ల అవసరం లేని లౌడ్ మ్యూజిక్ పెట్టాడేమో అనిపిస్తుంది, కానీ మొత్తం సినిమాని ఎలివేట్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించాడు. హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి, నేటి సమాజంలోని రాజకీయాల గురించి పలు అంశాల గురించి పలికించిన డైలాగ్స్ చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాని ఒక ప్రెజెంట్ అట్మాస్ఫియర్‌తో నడిపించడానికి బాగా ఉపయోగపడింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు చాలా ఫ్రేమ్స్‌లో కనిపించింది. ఇక లొకేషన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఇక సాంకేతిక విభాగాల్లో తమన్ సంగీతమే హైలైట్. ఆయన స్వరపరిచిన పాటలు ఒకెత్తైతే, నేపథ్య సంగీతం మరో ఎత్తు. జాజికాయ పాట తప్ప, మిగిలిన పాటలన్నీ కథలో కలిసిపోయాయి. రాంప్రసాద్, సంతోష్ దేటకే విజువల్స్ మెప్పిస్తాయి. ముఖ్యంగా కుంభ మేళా సన్నివేశాలు, హిమాలయాల నేపథ్యం సినిమా స్థాయిని పెంచాయి. మిగిలిన విభాగాలూ మంచి పనితీరుని కనబరిచాయి. సంభాషణలు చాలా పదునుగా ఉంటాయి. దర్శకుడు బోయపాటి శ్రీను కొనసాగింపు చిత్రానికి తగ్గట్టుగా కథ పరిధిని పెంచారు కానీ, దానికి కొత్తదనం అద్దితే ఇంకాస్త బాగుండేది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదు. అందుకే ప్రతి సన్నివేశం గ్రాండియర్‌గా కనిపిస్తుంది. పాన్ ఇండియా స్థాయి హంగులకి ఏమాత్రం తగ్గదు. తమన్ మరోసారి స్పీకర్లు పగలగొట్టే బాధ్యత తీసుకున్నాడు. ఇంటర్వెల్ నుంచి మామూలుగా వాయించలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా అది సినిమా మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అఖండతో సంగీత ప్రభంజనం చూపించిన తమన్ అఖండ తాండవంలో నిరాశపరిచాడు. కొన్ని సీన్లు తప్పా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా రొటీన్‌గానే ఉంటుంది. సీ రాంప్రసాద్-సంతోష్ కెమెరా వర్క్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ ఇమేజ్‌కు తగినట్టుగా లాజిక్ లేకుండా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారా అనిపిస్తుంది. అఖండకు ఏవైతే బలంగా మారాయో.. తాండవానికి అవే మైనస్ అయ్యాయి. పొంతన లేని కథ, కథనాలు, ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్. బాలకృష్ణ ఎలివేషన్ మినహాయిస్తే.. టోటల్ ఈ సినిమా నిరాశ పరిచే చిత్రమే.
(చిత్రం: అఖండ 2: తాండవం, రేటింగ్ : 2.25/5, విడుదల: డిసెంబర్ 12, 2025, రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్ర, జగపతిబాబు, కబీర్ దుహాన్ సింగ్, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్ విన్సెంట్, అచ్యుత్‌కుమార్, రచ్చ రవి తదితరులు. నిర్మాతలు: రామ్ ఆచంట - గోపి ఆచంట - ఇషాన్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, సమర్పణ: ఎం తేజస్విని నందమూరి, మ్యూజిక్: తమన్, సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాణం: 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ -ఐ.వి.వై ఎంటర్టైన్మెంట్ (బ్యానర్)
ఇంకా చదవండి: 'ఆంధ్రా కింగ్ తాలూకా' రివ్యూ : రామ్ వన్‌మ్యాన్ షో!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




