‘జటాధర’ మూవీ రివ్యూ :  మైథలాజికల్ థ్రిల్లర్!

‘జటాధర’ మూవీ రివ్యూ : మైథలాజికల్ థ్రిల్లర్!

27 days ago | 5 Views

‘ హీరో సుధీర్ బాబు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు.  జయాపజయాలతో  సంబంధమే లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సినిమా, సినిమాకి వేరియేషన్ చూపిస్తూ  ఈ మధ్య  వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు.  ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'జటాధర'. ‘హరోం హర’ సినిమా  వంటి పక్కా యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్,  ‘మా నాన్న సూపర్ హీరో’ వంటి క్లాస్ ఫాదర్ సెంటిమెంట్ చిత్రాల తర్వాత  తాజాగా ఆయన  హారర్  ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధర’ తో ప్రేక్షకులముందుకొచ్చాడు. షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి.. ఆ తర్వాత రాక్షస కావ్యం అనే చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ముఖ్య పాత్రలు పోషించిన  ఈ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 7)న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో సుధీర్ బాబుకి కమర్షియల్ సక్సెస్ దక్కిందా?  సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో చూద్దాం... 

కథలోకి... కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వేల కోట్ల విలువైన నిధిని ఎవ్వరూ దోచుకోకుండా ఉండేందుకు పిశాచ బంధనం వేస్తారు. అయితే కొందరి అత్యాశ కారణంగా ఆ బంధనం వీడి, ధన పిశాచి (సోనాక్షి సిన్హా) బయటికి వస్తుంది... కొన్ని ఏళ్ల తర్వాత ఓ సాధారణ గృహిణి, తన ఇంటి కింద ఉన్న లంకె బిందెలను బయటికి తీసేందుకు ప్రయత్నించగా పిశాచి కనిపిస్తుంది. దీంతో ఆమె ప్రవర్తన వింతగా మారుతుంది. ఈ కేసును పరిష్కరించేందుకు ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు) అక్కడికి వెళ్తాడు. దెయ్యాలు, భూతాలు లేవని బలంగా నమ్మే శివని, ధన పిశాచి ఏం చేసింది? ధన పిశాచి ఆధీనంలో ఉన్న సంపద ఎవరి సొంతం అయ్యింది? తెలియాలంటే ‘జటాధర’ సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ: 'జటాధర' మైథలాజికల్ థ్రిల్స్‌ను అందిస్తుంది. కథంతా సుధీర్ బాబు పాత్ర చుట్టూనే  తిరుగుతుంది. అతను పురాతన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాగిన ఆచారాలను పరిశోధిస్తాడు. 'జటాధర' సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లలో ఒకటి.  భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతికతతో  ఈ  చిత్రాన్ని రూపొందించిన క్రెడిట్ జీ స్టూడియెస్, ప్రేరణ అరోరాలకు దక్కుతుంది. పురాణాలు, సీక్రెట్, భావోద్వేగాలను మిళితం చేసి ఓ మంచి సినిమాటిక్ అనుభవంగా భారతీయ ఆధ్యాత్మిక లెన్స్‌ ద్వారా భయానక శైలిని  కలిగిస్తుంది.  ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఇది టోన్‌ను సెట్ చేస్తుంది.. కథ గడిచేకొద్దీ సుధీర్ బాబు పోషించిన శివుడిని మనకు పరిచయం చేస్తుంది. ఓ పురాతన శాపంతో ముడిపడి ఉన్న ఓ వింతైన రహస్యంలోకి, సోనాక్షి సిన్హా పోషించిన ధన పిశాచిని వెంటాడే ప్రపంచంలోకి లాగబడతాడు. సాంకేతికంగా జటాధర ఆశ్చర్యపరుస్తుంది. అత్యున్నత స్థాయి సినిమాటోగ్రఫీ అందించేందుకు కృషి చేసిన బృందాన్ని అభినందించాల్సిందే. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ప్రభావాన్ని చూపుతాయి. సుధీర్ బాబు అత్యంత శక్తివంతమైన పాత్రలో.. సవాల్‌తో కూడిన క్లైమాక్స్‌లో కెరీర్‌లో గుర్తుండిపోయే నటనను కనబరిచాడు. సోనాక్షి సిన్హా భయంకర రూపంలో మెచ్చుకునే రీతిలో మెరుగైన  నటను అందించారు. ఈ పాత్రలు సినిమా చూసిన తర్వాత మనల్నివెంటాడుతాయి. జటాధరను ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం కథే చెప్పే విధానమే. మానసిక స్ధితి, నిశ్శబ్ధం, నమ్మకం ద్వారా భయాన్ని పెంచింది. మొత్తంగా జటాధర భావోద్వేగాలతో కూడిన ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.  నటుడిగా తనను తాను మరింత మెరుగుపర్చుకుంటున్నారు సుధీర్ బాబు. ఈ సినిమాలో  శివగా అతని నటన చిత్రానికే  హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ ఒళ్లు జలదరించేలా  ఉన్నాయి. బాలీవుడ్‌లో గ్లామర్ డాల్‌గా, కమర్షియల్ హీరోయిన్‌గా మాత్రమే కనిపించిన సోనాక్షి సిన్హా, ఇందులో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించింది. ధన పిశాచిగా ఆమె లుక్స్, మేకోవర్ బాగా సెట్ అయ్యాయి. అయితే నటనలో మరింత ఇంటెన్సిటీ ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.. సీనియర్ నటి శిల్పా శిరోద్కర్‌తో పాటు దివ్య కోస్లా వంటి మిగిలిన నటులు, తమ పాత్ర పరిధిమేర నటించారు. 21 ఏళ్ల క్రితం ఉదయ్ కిరణ్‌తో ‘లవ్ టుడే’ మూవీలో నటించిన దివ్య కోస్లా కుమార్, 33 ఏళ్ల క్రితం మోహన్‌బాబుతో ‘బ్రహ్మా’ మూవీలో నటించిన శిల్పా శిరోద్కర్.. ‘జటాధర’తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఫస్టాఫ్‌ కాస్త స్లోగా సాగుతుంది. కథకు అడ్డుపడే చాలా సీన్లను ఎడిటింగ్‌లో తీసేయొచ్చనే ఫీల్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హర్రర్ సీన్సే ఈ చిత్రానికి  ప్రధాన బలం. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కవుట్ అయ్యింది.. ‘జటాధర’  ఓ హర్రర్ సినిమాలా  మొదలై, దేవాలయాల సంప్రదాయాలు, ఆచారాలను చూపిస్తూ సాగుతుంది. ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ కథ రాయగా అతనితో పాటు అభిషేక్ జైస్వాల్, మాటలు, డైరెక్షన్ చేశారు. తెలుగులో వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించగా, హిందీ వర్షన్‌ని అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించాడు. ఓవరాల్‌గా ‘జటాధర’ మూవీ, సుధీర్ బాబు నుంచి మరో విభిన్నమైన జోనర్ మూవీ. హర్రర్, ఫాంటసీ, మైథాలజీ మిళితం చేసిన జోనర్‌లో తెరకెక్కిన ‘జటాధర’ మూవీ ఆకట్టుకుంటుంది... ధన పిశాచిగా సోనాక్షి సిన్హా  తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆమె చేసిన అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి. సుధీర్ బాబు, ఘోస్ట్ హంటర్ గా తన నటనతో మెప్పించారు. అతీంద్రియ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.   'జటాధర' సాలీడ్ పర్ఫార్మెన్స్, గ్రిప్పింగ్ కథనంతో ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. సోనాక్షి సిన్హా ధన పిశాచినిగా మెరిసింది. ఇప్పటి వరకు ఆమె పోషించిన అత్యంత అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి. రొమాంటిక్ క్యారెక్టర్ల నుంచి డార్క్, ఇంటెన్స్ క్యారెక్టర్స్ వైపు తనను తాను మార్చుకుని తెరపై తనదైన ముద్ర వేసుకుంది. ఘోస్ట్ హంటర్‌గా సుధీర్ బాబు కూడా అంతే ఆకట్టుకున్నాడు. అతని ఉనికి కథకు డెప్త్‌ను జోడిస్తుంది. స్క్రీన్ ప్లే స్పష్టంగా ఉంది. కథ ఆద్యంతం కట్టిపడేస్తుంది. నేపథ్య సంగీతం ఈ సినిమా వాతావరణాన్ని పరిపూర్ణంగా పెంచుతుంది. బ్లాక్ మేజిక్ గురించి అవగాహన కలిగిస్తుంది. ఫైనల్‌గా జటాధర  సూపర్ నేచురల్ హారర్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.
ఇంకా చదవండి: “Predator: Badlands” – అన్ని జోన్లతో కలిపిన హాలీవుడ్‌ చిత్రం!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# జటాధర     # థ్రిల్లర్    

trending

View More