డిఫరెంట్ డార్క్ కామెడీగా “గుర్రం పాపిరెడ్డి” ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా

డిఫరెంట్ డార్క్ కామెడీగా “గుర్రం పాపిరెడ్డి” ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా

20 hours ago | 5 Views

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

- "గుర్రం పాపిరెడ్డి" సినిమాలో నేను సౌధామిని అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సౌధామిని నర్సుగా పనిచేస్తుంటుంది. డాక్టర్ చదువుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి పరిచయమై తన కథంతా మార్చేస్తాడు. ఆయన గ్యాంగ్ తో కలిసి సౌధామిని ఒక దోపిడీలో భాగం కావాల్సివస్తుంది. తెలివైన వారు, తెలివి తక్కువ వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నేను తెలివైన వారిలో ఉన్నానా, లేక తెలివి తక్కువ వారిలో ఉన్నానా అనేది సినిమాలో చూడాలి. బ్రహ్మానందం గారు జడ్జి క్యారెక్టర్ లో నటించారు. ఆయన ముందు మేము కోర్టులో ఉంటాం. డిఫరెంట్ గెటప్స్ లో కోర్టుకు వెళ్తాం. వరుసగా ఎంటర్ టైనింగ్ మూవీస్ లోనే నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ జానర్ సినిమాలంటే నాకు ఇష్టం. అందుకే వాటిని రిజెక్ట్ చేయకుండా నటిస్తున్నా. నాకు ఇంటెన్స్ క్యారెక్టర్స్ కూడా చేయాలని ఉంది. భగవంతుడు అనే మూవీలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నా. ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం హోల్డ్ లో ఉంది. ఆ సినిమాలో విలేజ్ గర్ల్ గా డిఫరెంట్ గా కనిపిస్తా.

- "గుర్రం పాపిరెడ్డి" సినిమాలో వైవిధ్యమైన గెటప్స్ లో కనిపిస్తా. సమ్మర్ లో ఆ గెటప్స్ తో షూటింగ్ చేశాం. మేకప్ తో రెడీ అయ్యేందుకు చాలా టైమ్ పట్టేది. అయితే యాక్టర్స్ కు ఇలా విభిన్నమైన మేకోవర్స్ లో కనిపించే అవకాశం తక్కువసార్లు వస్తుంది. జాతిరత్నాలు సినిమాలోని చిట్టి పాత్రతో సౌధామినిని పోల్చలేం. రెండూ వేర్వేరు తరహా పాత్రలు. చిట్టి అమాయకురాలు, కానీ సౌధామిని ఇంటెలిజెంట్ గా ఉంటుంది. నాకు ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఈ సినిమా సెట్ లో టైమ్ దొరికినప్పుడు కొత్త కాన్సెప్స్ట్ స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్ ఆలోచించేదాన్ని. నరేష్ అగస్త్య కూడా రైటర్ కాబట్టి అతనూ నా స్క్రిప్ట్స్ తయారీలో సపోర్ట్ చేసేవాడు.

Edhoti Chey Gurram Paapi Reddy Lyric - Gurram Paapi Reddy | Naresh  Agastya,Faria A | Krishna Saurabh

- ఈ మూవీకి కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఎంతో ప్యాషనేట్ గా మూవీ చేశారు. మా యాక్టర్స్ అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటా సినిమాకు ఏం కావాలో అవన్నీ సమకూర్చారు. సినిమాను కూడా ప్రచారం, డిస్ట్రిబ్యూషన్ పరంగా ఆడియెన్స్ కు బాగా రీచ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేనొక స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఆ పాటను రిలీజ్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మంచి పాటల్ని, బీజీఎం అందించారు. నేను ప్రమోషనల్ సాంగ్ కోసం ఆయన స్టూడియోకు వెళ్లాను. ప్యాషనేట్ టెక్నీషియన్ తాను.

- ఈ చిత్రంలో బ్రహ్మానందం గారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు గానీ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లో యోగి బాబు గారితో కలిసి చేశాం. నరేష్ అగస్త్యతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన మంచి కోస్టార్. స్క్రిప్ట్ విన్నప్పుడే "గుర్రం పాపిరెడ్డి" సినిమాలోని ఫన్, ఎంటర్ టైన్ మెంట్ ఎలా ఉంటుందో ఊహించగలిగాను. మా డైరెక్టర్ అంతే బాగా స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. డైరెక్టర్ మురళీ మనోహర్ విదేశాల్లో చదువుకున్నారు, వర్క్ చేశారు. ఆయనకు సినిమా మీద ప్యాషన్ ఉంది. అదే ప్యాషన్ తో సినిమాను బాగా రూపొందించారు.

- "గుర్రం పాపిరెడ్డి" సినిమాను ఆడియెన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు ప్రీమియర్స్ చూడబోతున్నాం. ఆ ప్రీమియర్స్ నుంచే వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేనూ అనుకుంటున్నా. మత్తువదలరా 3 సినిమా సన్నాహాల్లో ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్నా. నెక్ట్స్ ఇయర్ ఆ మూవీ రిలీజ్ అవుతుంది. అలాగే గాయపడ్డ సింహం అనే ఒక మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. ఆ మూవీ స్క్రిప్ట్ చాలా బాగుంటుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేయాలనుకుంటున్నా.

- అన్ని రకాల జానర్స్ మూవీస్ చేయాలనే కోరిక ఉంది. యాక్షన్ హీరోయిన్, సీరియల్ కిల్లర్..వంటి డార్క్ మూవీస్ చేయాలని ఉంది. హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలనేం లేదు. యాక్షన్ మూవీస్ కూడా బాగుంటాయి. జాతిరత్నాలు మూవీ తర్వాత అలాంటి ఇంపాక్ట్ ఉండే రోల్స్ రాలేదనే రిగ్రెట్ లేదు. ఒక మూవీ చేశాక ఆ ప్రాజెక్ట్ నుంచి వెంటనే డిటాచ్ అవుతుంటా. అలా మర్చిపోవడం నా అదృష్టమని భావిస్తా.
ఇంకా చదవండి: క్రిస్మస్‌ బాక్సాఫీస్ టార్గెట్… ‘శంబాల’ రెడీ టు రూల్ థియేటర్స్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# గుర్రం పాపిరెడ్డి     # నరేష్    

trending

View More