మటన్ సూప్ రివ్యూ.. ఆశ్చర్యపరిచే ట్విస్టులు

మటన్ సూప్ రివ్యూ.. ఆశ్చర్యపరిచే ట్విస్టులు

1 month ago | 5 Views

రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై  రామకృష్ణ వట్టికూటి సమర్పణలో రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలైంది. మరి ఈ మూవీ కథ ఏంటి? ఎలా ఉంది? అన్నది తెలుసుకుందాం..

కథ: శ్రీరామ్ (రమణ్) ఫైనాన్స్ ఏజెంట్ పనిలో భాగంగా ఇచ్చిన డబ్బులు, వడ్డీలు వసూల్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అందరికీ చెడ్డవాడిగా, శత్రువుగా మారిపోతాడు. కొన్ని సందర్భాల్లో కొంత మంది శ్రీరామ్ మీద దాడికి కూడా పాల్పడుతుంటారు. లైఫ్ ఇలా పోతుండగా.. ఫేస్ బుక్‌లో సత్య భామ (వర్షా విశ్వనాథ్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకసారి ప్రేమికుల రోజున పార్కులో గజగంగ్ దళ్‌కి కనిపిస్తారు. దీంతో ఆ గ్యాంగ్ వీరికి పెళ్లి చేసేస్తుంది. కానీ ఈ పెళ్లిని శ్రీరామ్ ఇంట్లో నిరాకరిస్తారు. శ్రీరామ్, సత్యను ఇంట్లోకి రానివ్వరు. దీంతో శ్రీరామ్ వేరు కాపురం పెట్టి హాయిగా బతికేస్తుంటాడు. అంతా సాఫీగానే సాగుతుందనుకునే టైంలో శ్రీరామ్ మీద దాడి జరుగుతుంది. అతని మొహం మీద యాసిడ్ పోస్తారు. దీంతో అతడ్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటుంది సత్య. ఈ దాడిని విచారించేందుకు శ్రీరామ్ దగ్గరి బంధువు శివరాం (జెమినీ సురేష్) ఎంట్రీ ఇస్తాడు. ఈ దాడి చేసింది ఎవరు? అని విచారిస్తాడు. ఈ విచారణతో బయటకు వచ్చిన నిజాలు ఏంటి? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.


ఎంత పెద్ద క్రైమ్ చేసినా, ఎంత తెలివితో చేసినా కూడా ఎక్కడో ఓ చోట చిన్న తప్పు చేసి దొరికిపోతారు. తప్పు చేస్తే కచ్చితంగా దొరికిపోవాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కోలా దొరికిపోతుంటారు. అలా ఓ జంట చాలా పకడ్బంధీగా క్రైమ్ చేస్తుంది. కానీ మటన్ సూప్ వల్ల దొరికిపోతుంది. ఆ కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆ కేసుని, ఆ నేపథ్యాన్ని తీసుకుని తన స్టైల్లో వడ్డించాడు దర్శకుడు రామచంద్ర వట్టికూటి. అయితే తెలిసిన కథే అయినా కూడా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడని చెప్పుకోవచ్చు.

మటన్ సూప్ సినిమాలో ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా, కొన్ని చోట్ల డీవియేట్ అయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ లింకులు, డీవియేషన్లకు సరైన సీన్లు సెకండాఫ్‌లో పడతాయి. ఈ మూవీకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. అక్కడే అసలు సిసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ మూవీకి మంచి బడ్జెట్ దొరికి, పెద్ద ఆర్టిస్టులు డేట్స్ ఇస్తే.. మరింత గ్రాండియర్‌గా తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఉన్న లిమిటెడ్ సోర్సెస్‌తో దర్శక, నిర్మాతలు మటన్ సూప్‌ను బాగానే వడ్డించే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి స్థాయిలో మటన్ సూప్ మాత్రం సంతృప్తిని ఇవ్వకపోవచ్చు.

సాంకేతికంగా అయితే మటన్ సూప్ అక్కడక్కడా మెప్పిస్తుంది. వెంకీ వీణ ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాటలు కొన్ని చోట్ల బాగుంటాయి. విజువల్స్ ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి. ఎడిటర్ చేయాల్సి పని ఇంకా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది.

 ఆర్టిస్టుల విషయానికి వస్తే రమణ్ మెరుగుపడినట్టుగా కనిపిస్తుంది. వర్ష లుక్స్ పరంగా ఓకే అయినా కూడా నటనలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. జెమినీ సురేష్ పాత్ర కీలకంగా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని ఇలా అందరూ పర్వాలేదనిపిస్తారు.

రేటింగ్ : 3.5

ఇంకా చదవండి: సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి గోదావరి సిరీస్ “ఆనందలహరి”

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మటన్ సూప్     # హర హర శంకర     # తనికెళ్ల భరణి    

trending

View More