భద్రకాళి మూవీ రివ్యూ : పొలిటికల్ థ్రిల్లర్!
2 months ago | 5 Views
(చిత్రం : భద్రకాళి, విడుదల : 19 సెప్టెంబర్ 2025, రేటింగ్: 2.5/5, నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురగన్, తృప్తి రవీంద్ర తదితరులు. దర్శకత్వం: అరుణ్ ప్రభు, నిర్మాత, సంగీతం : విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫి: షెల్లీ కాలిస్ట్, ఎడిటర్: రేమాండ్ డెర్రిక్ క్రాస్టా, ఆర్ట్: శ్రీరామన్, సమర్పణ: మీరా విజయ్ ఆంటోని, బ్యానర్: విజయ్ ఆంటోని కార్పోరేషన్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, స్రవంత్ రామ్ క్రియేషన్స్).
తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న తమిళ నటుల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. వినూత్న సినిమాలతో అలరిస్తూ వస్తున్నఅతడు సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సంగీత దర్శకుడిగా కొనసాగుతూనే విభిన్నతరహా పాత్రల్లో కనిపిస్తూ .. నటుడిగా సెలెక్టివ్ సినిమాలతో కెరీర్ లో ముందుకెళ్తున్నారు. విజయ్ ఆంటోనికి తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోను అభిమానులు ఉన్నారు. అందుకు కారణం ఆయన కథలను ఎంచుకునే తీరు, పాత్రలను డిజైన్ చేసుకునే పద్ధతి అనే చెప్పొచ్చు. ఆయన సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. హీరోగా ఇప్పటికి 25 సినిమాలు చేశారు. ఆయన నటించిన 25వ చిత్రం ‘శక్తి తిరుమగన్’. తాజాగా తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో అనువదించారు. తృప్తి రవీంద్ర కథానాయిక. రియా జీతు, సునీల్ కిర్పాలాని, సెల్ మురుగన్ కీలక పాత్రధారులు. తమిళంలో ‘అరువి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరుణ్ ప్రభు దర్శకుడు. దర్శకుడిగా ఆయనకు ఇది మూడో సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం (19 సెప్టెంబర్ 2025) ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. విజయ్ ఆంటోని గత చిత్రం 'మార్గాన్' ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరీ ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించిందో తెలుసుకుందాం...
కథ: రాజకీయ నాయకులు, ఐజీ ట్రాన్స్‌ఫర్, ఎమ్మెల్యే మర్డర్ వరకూ ఎలాంటి పనైనా క్షణాల్లో పూర్తి చేయగల సామర్థ్యం ఉన్నవాడు కిట్టూ (విజయ్ ఆంటోని). అనాథగా పెరిగిన అతడు తెలుగు రాజకీయాలను కుదిపే విధంగా పైరవీలు, లాబీయింగ్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదించే పనిలో ఉంటాడు. అందుకోసం తన టాలెంట్‌ను ఉపయోగించి అసాధ్యమైన పనులను కూడా ఈజీగా చేసి డబ్బులు కూడబెడుతుంటాడు. సాధారణ జనాలకు మంచీ చేస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు. ఢిల్లీలో పెద్ద పదవిలో ఉన్న మేడమ్‌కి చెందిన మూడు వందల ఎకరాల ల్యాండ్ విషయంలో కిట్టూ కలగజేసుకోవడంతో ఇదంతా చేస్తుంది ఎవరా.. అని మేడమ్‌తోపాటు దేశానికి రాష్ట్రపతి కావడమే టార్గెట్‌గా పెట్టుకున్న అభయంకర్ (సునీల్ కిర్పాలాని) కిట్టూపై నిఘా పెడతాడు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహ కర్త, పారిశ్రామిక వేత్త అభ్యంకర శంకర్‌కు ధీటుగా కిట్టూ ఎదుగుతాడు. కిట్టూ పన్నెండేళ్లుగా బ్రోకర్‌గా పని చేస్తూ ఆరు వేల కోట్లు కూడబెట్టాడని తెలుస్తుంది. అయితే తన లక్ష్యానికి అడ్డుగా వస్తున్న కిట్టూపై కేసులు పెట్టి.. అక్రమంగా సంపాదించిన 6236 కోట్ల రూపాయలను పట్టించడమే కాకుండా జైలులో పెట్టిస్తాడు అభయంకర్. ఈ విషయాన్ని గ్రహించిన కిట్టూ ఏం చేశాడు.. అసలు అతని బ్యాగ్రౌండ్ ఏంటి? బ్రోకర్‌గా ఇంత మొత్తం ఎందుకు సంపాదించాడు? అసలు కిట్టూ ఎవరు? కిట్టూ గతం ఏమిటి? కిట్టూ పైరవీకారుడిగా, లాబియిస్టుగా ఎలా ఎదిగాడు? కిట్టూ అక్రమంగా ఎందుకు డబ్బు సంపాదించే పనిలో పడ్డాడు. పారిశ్రామిక వేత్త అభ్యంకర్ లక్ష్యం ఏమిటి? అభ్యంకర్‌కు కిట్టూకు ఏమైనా పగ ప్రతీకారాలు ఉన్నాయా? అభ్యంకర్ లక్ష్యానికి కిట్టూ ఎందుకు అడ్డుపడ్డాడు? 6 వేల కోట్లకుపైగా సంపాదించిన డబ్బును కిట్టూ ఏం చేశాడు? చిరకాలంగా అభ్యంకర్ కన్న కలలను కిట్టూ ఎలా కూల్చాడు అనేది 'భద్రకాళి' సినిమా కథ.
విశ్లేషణ: సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత, సొసైటీకి ఏదో మంచి చెప్పాలని ఆలోచించే దర్శకులు కొంతమంది ఉంటారు. ఈ సినిమా చూశాక దర్శకుడు అరుణ్ ప్రభు కోవకు చెందినవారే అనిపిస్తుంది. ఆయన ఎంచుకున్న కథలో రాజకీయాలు, నల్లధనం, అవినీతిపై ప్రశ్నలు సంధించడం వంటివి ఉన్నాయి. ఈ తరహా కథాంశంతో ఇప్పటికే. ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ వంటి సినిమాలు వచ్చాయి. అయితే శంకర్ తీసిన సినిమాల్లో సమస్యతోపాటు వాటికి పరిష్కారం కూడా చూపించారు. ఇందులో ప్రశ్నలు మాత్రమే సంధించారు దర్శకుడు అరుణ్ ప్రభు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కానీ వాటికి పరిష్కార మార్గం కూడా చూపించి ఉంటే రిజల్ట్ ఇంకోలా బావుండేది. సమాజంలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల దోపిడి.. పేదవాడు పేదవాడిగానే ఎందుకు ఉండిపోతున్నాడు.. సంపద అంతా కొందరి చేతుల్లోనే ఉండటం వల్ల దేశానికి ఎలాంటి నష్టం వాటిల్లుతుంది. దేశంలోని సంపదను దోచుకొని పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఎలా స్థిరపడుతున్నారు? అనే పాయింట్లను మాత్రం సినిమాలో చక్కగా చూపించారు. కిట్టూ ఓ పవర్ఫుల్ బ్రోకర్… దేశంలో ఏ పనైనా చేయగలడు అని చూపించే ఎలివేషన్లతో కథ మొదలవుతుంది. కిట్టూ చేసే ప్రతి పని ఆసక్తిగా కథను ముందుకు తీసుకెళ్లింది. కథ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రేక్షకుడి ఊహకు అందకుండా దర్శకుడు రన్ చేశాడు. స్టోరీ రన్ ఎత్తులు పైఎత్తులు, ఇంటెలిజెన్స్ ఆకట్టుకున్నాయి. కిట్టును పోలీసులు అదుపులోకి తీసుకునే వరకూ కూడా కథ అత్యంత వేగంగా కథ నడుస్తుంది. బ్రోకర్ గా ఉన్నా ఎంతోమందికి మంచి చేస్తూ అతని టార్గెట్ ఏంటో చెప్పకుండా ఆసక్తికరంగా నడిపించారు. అక్కడి దాకా పెద్దగా పేరు పెట్టక్కర్లేదు. ఇంటర్వెల్ నుంచి కథ ట్రాక్ తప్పిన భావన కలుగుతుంది. సెకండాఫ్ లో అతని బాల్యం, బ్రోకర్ గా మారడానికి కారణాలు చూపించారు. కిట్టు వర్సెస్ అభయంకర్ గేమ్ మొదలు అయ్యాక కథ అంతా రెగ్యులర్ ఫార్మెట్లోకి వెళ్లిపోతుంది. ఫస్టాఫ్ లో హీరో చూపించిన ఇంటెలిజెన్స్ సెకెండాఫ్ లో లేదు. వాట్ నెక్ట్స్ అనేది క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్, అభయంకర్ ఆట కట్టించడానికి హీరో వేసిన ప్లాన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. కథలో హీరో ఆశయం చాలా పెద్దది. అయితే అది నెరవేరడం ఇప్పుడున్న పొలిటికల్ వ్యవస్థలో సాధ్యం కాదు. అయితే వాటిని జనాలకు అర్ధమయ్యేలా చెప్పినా సరిపోయేది. డైలాగ్ పార్ట్, సన్నివేశాల్లో బోధన ఎక్కువ కావడంతో నసలా అనిపిస్తుంది. చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో అనాథగా మారిన కిట్టూ సమాజంలోని లోటుపాట్లను గ్రహించి రాబిన్‌హుడ్‌గా పేదలకు సహాయం అందించాలన్న పాయింట్‌తో అరుణ్ ప్రభు రాసుకొన్న కాన్సెప్ట్ బాగుంది. అయితే కథను సాఫీగా, ఎలాంటి గందరగోళం లేకుండా స్ట్రెయిట్‌గా చెప్పి ఉంటే.. సినిమా మరింత ఆసక్తికరంగా ఉందేది. ఫస్టాఫ్‌లో కథను ఆసక్తికరంగానే కాకుండా గ్రిప్పింగ్‌గా నడిపించిన తీరు చూస్తే.. ఏదో ఫీల్ గుడ్ అటెంప్ట్ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సింగిల్ పాయింట్ మీద ఎజెండాతో స్టోరిని నడిపించడం వల్ల సెకండాఫ్‌లో సినిమా తేలిపోయింది. ఈ సినిమాలో చాలా వరకు మంచి ఇంప్రెస్ చేసే అంశాలు ఉన్నప్పటికీ కొన్ని లోపాలు కూడా లేకపోలేవు. కథనం ఒకింత సీరియస్ గా ఉన్నప్పటికీ పలు సన్నివేశాలు వాటిలోని డీటైలింగ్ పరంగా మాత్రం మరింత అటెన్షన్ ఈ తరహా చిత్రాలకి అవసరం ఉంటుంది కానీ అది ఈ సినిమాలో మిస్ అయ్యింది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సినిమాలో మరీ అంత ప్రభావవంతంగా కనిపించదు.
ఈ చిత్రం ఆరంభమే చూసే ఆడియెన్ ని కట్టిపడేసే విధంగా మొదలవుతుంది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత కథనం అలా ఒకో లేయర్ లోకి వెళ్లే కొద్దీ మరింత గ్రిప్పింగ్ గా మారడం అనేది ఇంప్రెస్ చేస్తుంది. మంచి డైలాగ్స్ అదే రీతిలో ఉత్సుకత నెలకొల్పే ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ కథనాన్ని ఎంగేజింగ్ గా సాగించాయి. డబ్బున్నవాడికి మాత్రమే ఈ భూమ్మీద బ్రతికే అర్హత ఉందని భావించే ప్రతినాయకుడికీ, మానవత్వం లేనివారికి ఈ నేలపై చోటులేదని భావించే నాయకుడికి మధ్య జరిగే కథ ఇది. ప్రశ్నించే వాడు ఉండకూడదనేదే ప్రతినాయకుడి ప్రధానమైన ఉద్దేశమైతే, ప్రశ్నించని క్షణం నుంచే అణచివేత మొదలవుతుందనేది నాయకుడి అభిప్రాయం. అలాంటి వీరిద్దరి చుట్టూనే దర్శకుడు ఈ కథను తిప్పుతూ వెళ్లాడు. పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలలో ఒక వైపున రాజకీయాలు .. మరో వైపున పోలీస్ అధికారులు .. ఇంకొక వైపున మీడియా హడావిడి అనేవి తెరపై కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి లక్షణాలతోనే ఈ సినిమా కూడా కనిపిస్తుంది. తమిళంలో ఈ సినిమా 'శక్తి తిరుమగన్' పేరుతో రూపొందింది. తెలుగులో 'భద్రకాళి' అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. 'భద్రకాళి' అనే పేరు పవర్ఫుల్ అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ ఈ టైటిల్ కీ .. ఈ సినిమా కథకి సంబంధం లేకపోవడమే ఆశ్చర్య కరమైన విషయం. సాధారణంగా విజయ్ ఆంటోని సినిమాలు ఒక కాన్సెప్ట్ కి కట్టుబడి కొనసాగుతాయి. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు .. కామెడీ ఆయన సినిమాలలో కనిపించవు. అయితే లైట్ గా రొమాన్స్ ను టచ్ చేస్తూ, దర్శకుడు అరుణ్ ప్రభు ఈ కథను రెడీ చేసుకున్నాడు. అయితే హీరో నడిచే మార్గాన్ని .. ఆయన ఉద్దేశాన్ని పెర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడని అనిపిస్తుంది. సీరియస్ గా సాగే ఇలాంటి పాత్రలను విజయ్ ఆంటోని బాగానే చేస్తాడని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ తరహా కథలు .. పాత్రలు గతంలో ఆయన చేసినవే.
ఎవరెలా చేశారంటే... విజయ్ ఆంటోని తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగా కిట్టూ పాత్రను ఎంచుకొని అందులో ఒదిగిపోయాడు. కానీ కథ, కథనాలు, తన క్యారెక్టర్ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సిందనిపిస్తుంది. నటుడిగా విజయ్ ఆంటోని కథల ఎంపిక బావుంటుంది. కథకు తగ్గట్టు అతని పాత్ర తీరు కూడా అలరిస్తుంది. ఈ సినిమాలో కిట్టూ పాత్ర కూడా అలాగే ఉంది. పాత్ర పరిధి మేరకు చక్కగా నటించాడు. హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ తృప్తి రవీంద్రది చిన్న పాత్రే. కిట్టూకి భార్యగా చక్కని నటన కనబర్చింది. రాష్ట్రపతి కావాలని కొన్నేళ్లగా తపన పడుతున్న వ్యక్తిగా, రాజకీయ నేతల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్లాన్స్ ఇచ్చి గవర్నమెంట్ను శాసించే వ్యక్తిగా సునీల్ కిర్పాలనీ ఇందులో కనిపించారు. ఆ పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. స్పెషల్ ఆఫీసర్ రామ్ పాండేగా కిరణ్ నటన బావుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొంత బావున్నాయి. రియా జీతూ కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో కనిపించి మెప్పించారు. హీరోకి సపోర్టివ్ రోల్లో మారుతిగా సెల్ మురుగన్ అలరించారు.
టెక్నికల్ విషయాలకు వస్తే.. సినిమాటోగ్రఫీ బావుంది. విజయ్ ఆంటోని సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. నేపథ్య సంగీతం ముందుకు తీసుకెళ్లింది. కానీ ఇంపాక్ట్‌ఫుల్ మ్యూజిక్‌కు తగిన సన్నివేశాలు పడకపోవడంతో మైనస్. స్వయంగా విజయ్ ఆంటోని మ్యూజిక్ చేశారు. కానీ పాటలు చాలా డల్'గా ఉండటం మరో మైనస్. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్‌గా.. రివెంజ్‌తో సాగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'భధ్రకాళి' సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లే ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. మంచి కాన్సెప్ట్‌తో రూపొందించాలనే తపన మాత్రమే కనిపించింది. మొత్తం మీద పొటిలికల్ థ్రిల్లర్ కథలు ఇష్టపడేవారు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కొంత వరకూ సంతృప్తి చెందుతారు. ఒక ప్రశ్నను సంధించినప్పుడు.. కుదిరితే దానికి సరైన సమాధానం ఇవ్వాలి, లేదంటే.. ఆ ప్రశ్నకు సమాధానం జనాలు ఆలోచించేలా వదిలేయాలి. అంతేకానీ.. రేకెత్తించిన మంచి ప్రశ్నకు ఏదో సమాధానం ఇవ్వాలి కాబట్టి, కమర్షియల్ జస్టిఫికేషన్ తో ముగించడం అనేది అనేది సంతృప్తినివ్వదు. అరుణ్ ప్రభు లాంటి దర్శకుడి నుండి మాత్రం ఇలాంటి జస్టిఫికేషన్ ఊహించలేదు. అందువల్ల.. ఆసక్తికరంగా మొదలైన ఫస్టాఫ్, సెకండాఫ్ కి వచ్చేసరికి మందగమనంగా సాగుతుంది. అందువల్ల సినిమా ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి.
ఇంకా చదవండి: సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న '' మనసులోని మాట ''
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# భద్రకాళి # విజయ్ ఆంటోని




