మమ్ముట్టి నటన అద్భుతం: విద్యాబాలన్‌

మమ్ముట్టి నటన అద్భుతం: విద్యాబాలన్‌

11 days ago | 11 Views

మమ్ముట్టి  ప్రధాన పాత్రలో నటించిన 'కాదల్‌.. ది కోర్‌’ ను ఉద్దేశించి నటి విద్యాబాలన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా మలయాళీ చిత్రాలు చూస్తున్నా. మోహన్‌లాల్‌ సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. ఇటీవల నేను మమ్ముట్టి యాక్ట్‌ చేసిన 'కాదల్‌ ది కోర్‌’ చూశా. ఆయన అద్భుతంగా నటించారు. సినిమా చూసిన తర్వాత దుల్కర్‌ సల్మాన్‌కు మెసేజ్‌ పంపించా.


ఆ సినిమా నాకెంతో నచ్చిందని చెప్పా. నా సందేశాన్ని మమ్ముట్టికి చేరవేయమన్నా. బాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ ఇలాంటి చిత్రంలో యాక్ట్‌ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించరు‘ అని అన్నారు. అనంతరం ఆమె ’డర్టీ పిక్చర్‌’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘స్మోకింగ్‌ ఎలా చేయాలో నాకు తెలుసు. కానీ ఎప్పుడూ దాని జోలికి వెళ్లలేదు.'డర్టీ పిక్చర్‌’ తర్వాత స్మోకింగ్‌ అలవాటుగా మారింది. కొన్ని రోజులపాటు దానిని కొనసాగించా. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అర్థమైంది. దాంతో దానిని దూరం పెట్టా‘ అని చెప్పారు.

ఇంకా చదవండి: పెళ్లినాటి గౌనుకు కొత్త అందాలు... సమంత క్రేజీ నిర్ణయం!

# Mammootty     # Socialmedia     # Vidyabalan