పెళ్లినాటి గౌనుకు కొత్త అందాలు... సమంత క్రేజీ నిర్ణయం!

పెళ్లినాటి గౌనుకు కొత్త అందాలు... సమంత క్రేజీ నిర్ణయం!

11 days ago | 8 Views

స్టార్‌ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న సామ్‌ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కాగా, గత కొన్ని రోజులగా మయోసైటిస్‌ కారణంగా సామ్‌ సినిమాలకు కాస్త బ్రేక్‌ తీసుకుంది. కానీ, సోషల్‌ విూడియా వేదికగా మాత్రం తరచూ అభిమానులతో టచ్‌లోనే ఉంటూ వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకుంటోంది. తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్‌ చేయించి ఓ అవార్డు కార్యక్రమంలో ధరించింది. ప్రస్తుతం సామ్‌ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. సమంత 2017లో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడిపోయారు. ఇక అప్పుడు వీరి వివాహం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో జరిగింది. కైస్త్రవ పద్ధతిలో జరిగిన వివాహానికి ప్రత్యేకంగా వైట్‌ గౌన్‌ను సామ్‌ డిజైన్‌ చేయించుకుంది. ఆ గౌనును ఇప్పుడు బ్లాక్‌ కాక్‌టైల్‌ స్టాప్ర్‌లెస్‌ గౌనుగా 

మార్చేసింది. ముంబై వేదికగా జరిగిన ’ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమంలో ఆ బ్లాక్‌ గౌనును ధరించి స్టేజ్‌పై మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సామ్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. తనకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్‌ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించినట్లు తెలిపింది. తన అలవాట్లను మార్చుకోవడం, జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్‌ చేయించడం కూడా ఒకటని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇంకా చదవండి: డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలు ప్రారంభం

# Samantharuthprabhu     # Nagachaitanya     # Instagram