హవీష్, నక్కిన త్రినాథరావు కాంబోలో క్రేజీ మూవీ గ్లింప్స్ ఈ నెల 19న రివీల్
5 months ago | 5 Views
నువ్విలా,జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో ఓ క్రేజీ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీకి నిఖిల కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హవీష్, నక్కిన త్రినాథరావు మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.
నటీనటులు - హవీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
నిర్మాణం- హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి
ఫైట్స్ - రామకృష్ణ
ఎడిటర్ - ప్రవీణ్ పూడి
డీవోపీ - నిజార్ షఫీ
సంగీతం - మిక్కీ జే మేయర్
స్టోరీ, డైలాగ్స్ - విక్రాంత్ శ్రీనివాస్
మార్కెటింగ్ : క్రేజీ షౌట్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాత - నిఖిల కోనేరు
రచన: దర్శకత్వం - నక్కిన త్రినాథరావు
ఇంకా చదవండి: హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హనుమాన్ జంక్షన్' జూన్ 28న రీ-రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# నక్కిన త్రినాథరావు # హవీష్




