బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది!

బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది!

10 days ago | 5 Views

బాలీవుడ్‌లో ఓ శకం ముగిసింది. 'హీ-మ్యాన్' ధర్మేంద్ర  తుదిశ్వాస విడిచారని తెలియగానే చిత్రసీమ యావత్తు శోకసముద్రంలో మునిగిపోయింది.  నేడు చిత్రసీమలో ఎందరో కండలవీరులు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. హిందీ సినిమారంగంలో అలాంటి స్టేటస్ చూసి 'మ్యాచో మేన్'గా జేజేలు అందుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ సెవెంటీ ఎమ్.ఎమ్. డేస్ దాకా ధర్మేంద్ర తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.  హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించిన ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న జన్మించారు.  మరో రెండు వారాల్లో 90 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ధర్మేంద్ర సోమవారం ఉదయం కన్నుమూయడంతో హిందీ సినిమారంగంలో ఓ శకం ముగిసింది. గత కొన్నాళ్ళుగా ధర్మేంద్ర వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించగానే, ధర్మేంద్ర కన్నుమూశారన్న ప్రచారం సాగింది. దానిని కుటుంబ సభ్యులు ఖండించారు. తరువాత కొద్ది రోజులు ఇంట్లోనే చికిత్స పొందుతూ ధర్మేంద్ర సోమవారం కన్నుమూశారు. ఆయన మరణవార్త వినగానే బాలీవుడ్ లో విషాధఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల భారతప్రధాని నరేంద్ర మోదీ, పలువురు మంత్రులు, సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8వ తేదీన ధర్మేంద్ర జన్మించారు. ఆయన తండ్రి ఓ స్కూల్ లో హెడ్మాస్టర్ గా పనిచేసేవారు. ధర్మేంద్ర కూడా తండ్రి వద్ద చదువుకొనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రిక్యూలేషన్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోనే సాగారు. 1954లో ప్రకాశ్ కౌర్ తో ధర్మేంద్ర వివాహం జరిగింది. తరువాత రకరకాల కాస్ట్యూమ్స్ తో ఫోటోలు తీయించుకొని హిందీ చిత్రసీమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ధర్మేంద్ర ముంబై చేరారు. అదే సమయంలో 'ఫిలిమ్ ఫేర్' మేగజైన్ న్యూ టాలెంట్ సర్చ్ నిర్వహించగా అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. 1960లో 'దిల్ భీ తేరా హమ్ భీ తేరే' సినిమాతో తొలిసారి ధర్మేంద్ర తెరపై కనిపించారు. "షోలా ఔర్ షబ్నమ్ (1961), అన్ పడ్ (1962), బందిని (1963)" ధర్మేంద్రకు నటునిగా గుర్తింపు లభించింది. రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన 'ఆయీ మిలన్ కీ బేలా'లో ప్రతినాయకునిగా నటించి మంచి మార్కులు సంపాదించారు ధర్మేంద్ర. ఆ పై 1966లో 'ఫూల్ ఔర్ పత్తర్'లో హీరోగా నటించారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఆధారంగా తెలుగులో యన్టీఆర్ హీరోగా 'నిండుమనసులు' (1967) చిత్రం తెరకెక్కి విజయం చేజిక్కించుకుంది. "షికార్, ఇజ్జత్, ఆంఖే, ఆద్మీ ఔర్ ఇన్ సాన్, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, దోస్త్, యాదోంకీ బారాత్, జుగ్ను, షోలే, మా, చరస్" వంటి సూపర్ హిట్ మూవీస్ లో ధర్మేంద్ర నటించారు. తనకు హిట్ పెయిర్ గా సాగిన హేమామాలినిని ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో భార్యాబిడ్డలు ఉండి మరో పెళ్ళి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అయితే ముస్లిమ్ సంప్రదాయంలో పెళ్ళి చేసుకోవడంతో ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టారు ధర్మేంద్ర, హేమామాలిని జోడీ. వయసు మీద పడ్డా తరువాతి రోజుల్లోనూ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ సాగారు ధర్మేంద్ర. ఈ యేడాది 'ఇక్కిస్' అనే చిత్రంలో హీరో తండ్రి పాత్రలో నటించారు ధర్మేంద్ర.

ఈ సినిమా డిసెంబర్ 26న విడుదల కానుంది. ధర్మేంద్ర రెండో భార్య హేమామాలిని, తనయులు సన్నీ డియోల్, బాబీ డియోల్, కూతుళ్ళు ఇషా డియోల్, అహనా డియోల్ - అందరూ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేసినవారే కావడం విశేషం.  తెలుగువారితో ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉంది. తెలుగు వారు నిర్మించిన "జానీ దోస్త్, వీరూ దాదా"వంటి చిత్రాల్లో నటించారు... తెలుగు దర్శకుడు తాతినేని ప్రకాశరావు రూపొందించిన 'ఇజ్జత్' సినిమాలో ధర్మేంద్ర ద్విపాత్రాభినయం చేసి అలరించారు. నటరత్న యన్టీఆర్ తన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ సాంగ్స్ ను ధర్మేంద్ర రికార్డింగ్ థియేటర్ లోనే రూపొందించడం విశేషం.  ఇలా తెలుగు చిత్రసీమతోనూ అనుబంధం ఉన్న ధర్మేంద్ర 200పైగా చిత్రాల్లో నటించారు. యాక్షన్ ఇమేజ్ తో సాగుతూనే కామెడీని మిళితం చేసి పాత్రలను రంజింప చేయడంలో ధర్మేంద్ర తనదైన బాణీ పలికించారు. పలు మల్టీస్టారర్స్ లో నటించిన ధర్మేంద్రకు అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నా, వినోద్ ఖన్నా, జితేంద్ర వంటి స్టార్స్ ఎంతో గౌరవమిచ్చేవారు. తరువాతి రోజుల్లో అనేకమంది బాలీవుడ్ హీరోస్ ధర్మేంద్ర బాణీలోనే కామెడీని మిక్స్ చేసి తమకు లభించిన పాత్రలను రక్తి కట్టించారు. అమితాబ్ బచ్చన్ సైతం 'షోలే'లో ధర్మేంద్ర తో కలసి నటించి, ఆ పై ఆయన పంథాలోనే హాస్యం పండిస్తూ యాక్షన్ రోల్స్ పోషించడం విశేషం.   'హీ-మ్యాన్‌'గా  పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర, దాదాపు 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. వందల సినిమాలకు పైగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.  ఈ లాంగ్ కెరీర్‌లో ప్రొఫెషనల్‌గానే గాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో ఎదిగారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ల నుంచి స్ట్రాంగ్ ఫ్యామిలీ హెరిటేజ్‌ని నిర్మించారు. ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’  సినిమాతో బాలీవుడ్‌లో తన సినీ జర్నీ స్టార్ట్ చేశారు. ఈయన మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ రూ.51 మాత్రమే. 1960లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేశారు. 1970 నుంచి 80 మధ్యలో వరుసగా 'షోలే' వంటి హిట్ సినిమాలు చేస్తూ స్టార్‌డమ్‌ని అనుభవించారు. అలా 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఓవరాల్‌గా కెరీర్ లో  300కు పైగా సినిమాలు చేశాడు. తన నటన, పర్సనాలిటీతో ఇండియాలోనే అత్యంత పాపులర్ యాక్టర్లలో ఒకడిగా పాపులర్ అయ్యారు. పిల్లలను సైతం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి తన లెగసీని కంటిన్యూ చేయించాడు. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1960ల నుండి 1980ల వరకు ఈయన నటించిన చిత్రాలు యాక్షన్, రొమాన్స్, కామెడీకి ఐకాన్‌గా నిలిచాయి. 300కు పైగా సీనియమాలు చేసిన ఈయన ఎక్కువగా యాక్షన్ చిత్రాలతోనే మెప్పించారు. దీంతో అభిమానులు కూడా యాక్షన్ కింగ్, హీ-మ్యాన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. షోలే (1975) చిత్రం ఆయన కెరీర్‌లో పెద్ద మలుపు. ఆ తర్వాత సీత ఔర్ గీత, చుప్కే చుప్కే, ధరమ్‌ వీర్ వంటి క్లాసిక్ చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆయన ఎంతమంది దర్శకులతో చేసినా, అన్నీ వేటికవే వైవిధ్యభరితంగా ఉండటం విశేషం. బాలీవుడ్‌లలో కండలు తిరిగిన సౌష్టవంతో కనిపించి ఆరోజుల్లోనే ధర్మేంద్ర ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆరోజుల్లో చాలామంది అమ్మాయిల కలల రాకుమారునిగా నిలిచారు. ఏకంగా అందరి ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలతారను ఆయన తన సొంతం చేసుకున్నారు. ‘మేచో మేన్’గా పేరొందిన తొలినటుడిగా పేరుగాంచిన ధర్మేంద్ర.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ప్రస్తుత ట్రెండ్‌ వరకు తన చిత్రాలకు కలెక్షన్స్‌ వర్షం కురిసింది. బాలీవుడ్‌ నుంచి సౌత్‌ ఇండియా వరకు సుమారు రెండు దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమలో ఎదురులేని మనిషిగా రాణించారు. లూధియానా  సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామంలోని  ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. దీంతో ఆయన అక్కడే  ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. చదువుల్లో  పెద్దగా చురుకుగా ఉండేవాడు కాదు.


ఏదో రకంగా తన మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అయితే, స్కూల్‌ రోజుల్లోనే స్టేజీలపై నాటకాలు వేయడం ఇష్టం. అప్పట్లో ‘పిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారి టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పోటీలో ధర్మేంద్ర విజేతగా నిలవడంతో కెరీర్‌ మలుపు తిప్పింది. ముంబైకి వస్తే సినిమా ఛాన్సులు ఇస్తామని వారు చెప్పడంతో అటువైపు అడుగులు వేశారు.  ముంబై వెళ్లిన ఆయనకు నిరాశే ఎదురైంది. కానీ, పట్టువదలకుండా అక్కడే ఉంటూ తన వేట సాగించారు. సరిగ్గా అలాంటి సమయంలోనే దర్శకుడు అర్జున్ హింగోరానీ కంటికి  ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి ఫిదా అయిపోయాడు. దీంతో తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు.  అలా తన మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’లో మెప్పించారు. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి  ధర్మేంద్ర నటించడం విశేషం. అయితే, అనుకున్నంత రేంజ్‌లో ఆ సినిమా  మెప్పించలేదు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించాల్సి వచ్చింది. 1962లో  విడుదలైన  ‘అన్ పడ్’  చిత్రం సూపర్‌ హిట్ ​ అయింది. కానీ, 1966లో వచ్చిన  ‘ఫూల్ ఔర్ పత్థర్’ చిత్రం ధర్మేంద్రను స్టార్‌ హీరోను చేసింది. 1970 ధర్మేంద్ర, హేమమాలినితో జోడీ మొదలైంది. వారిద్దరి కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, చరస్, దోస్త, మా, షోలే, ఆజాద్ వంటి సినిమాలు వారిద్దరి కాంబినేషన్‌లో సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే, అప్పటికే ధర్మేంద్రకు పెళ్లి అయిపోయింది. పిల్లలు కూడా ఉన్నారు. కానీ, హేమ మనసు ఆయనతో కలిసి అడుగులు వేయాలని కోరుకుంది. దీంతో వీరిద్దరూ 1980లో వివాహం చేసుకున్నారు. ఈ జోడికి జన్మించిన వారే ఇషా డియోల్, అహనా డియోల్ . ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్‌కు జన్మించిన వారిలో సన్నీ డియోల్, బాబీ డియోల్ ఉన్నారు. వారిద్దరూ కూడా  హీరోలుగా మెప్పించారు. హేమామాలినితో పెళ్లి తర్వాత కూడా తన కుమారులని ఆయన దూరం పెట్టలేదు. నిర్మాతగా వారిద్దరిని హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు.ధర్మేంద్ర కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ సత్తా చాటారు. రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. 2012లో భారత  ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 1935 డిసెంబర్‌ 5వ తేదీన జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్‌ సింగ్‌ డియోల్‌. ధర్మేంద్ర-ప్రకాశ్ కౌర్‌కు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర-హేమామాలిని ఇషా డియోల్‌, ఆహానా డియోల్‌ సంతానం. అత్యంత ప్రాచుర్యం పొందిన 'షోలే'లో వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు. ఆ సినిమా ఆయన సినీ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది.  అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, గాయల్, లోఫర్, మేరా నామ్ జోకర్ తదితర చిత్రాల్లోనూ నటించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ లోక్‌సభ స్థానం నుంచి నెగ్గి ఎంపీగా కూడా పని చేశారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేశారు.   ఆయన కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా 1975లో వచ్చిన 'షోలే'. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర చిరస్మరణీయమైనది. దీంతో పాటు 'ఫూల్ ఔర్ పత్తర్', 'మేరా గావ్ మేరా దేశ్', 'యమ్‌లా పగ్లా దీవానా' సిరీస్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు. ఆయన నేచురల్ యాక్టింగ్, ఆకర్షణీయమైన రూపం, ఉద్వేగభరితమైన నటన ఆయనను దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిపాయి. భారతీయ సినీ చరిత్రలో ఆయన పోషించిన పాత్రలు, సాధించిన విజయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆయనకు అభిమానులు ప్రేమగా ఇచ్చిన నిక్‌నేమ్ 'బాలీవుడ్ హీ-మ్యాన్'. ఈ పేరు వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? ధర్మేంద్ర 'హీ-మ్యాన్' అనే నిక్‌నేమ్ రావడం వెనుక ఆయనకున్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.. మస్క్యులర్ బాడీ మరియు రగ్గుడ్ లుక్స్: 1960ల, 70ల నాటి బాలీవుడ్ నటులలో ధర్మేంద్ర బాడీ ప్రత్యేకంగా ఉండేది. ఆయన మస్క్యులర్ బాడీ (కండలు తిరిగిన శరీరం), పంజాబీ మూలాలున్న ఆయన రగ్గుడ్ లుక్స్ కారణంగా ఆయనకు ఈ పవర్ఫుల్ పేరు వచ్చింది. ఆ కాలంలో భారతీయ తెరపై పూర్తి స్థాయి యాక్షన్ స్టార్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1960ల మధ్య నుండి 1970ల వరకు ధర్మేంద్ర గారు ఎక్కువగా యాక్షన్ పాత్రలలో నటించారు. 'షోలే', 'ధరమ్ వీర్', 'మేరా గావ్ మేరా దేశ్' వంటి సినిమాల్లో ఆయన పోషించిన సాహసోపేతమైన, ధైర్యవంతులైన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్రల ద్వారా ఆయన శక్తిమంతుడైన హీరోగా ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ ఆయనకు హీ మ్యాన్ అనే నిక్‌నేమ్ పెట్టారు. ధర్మేంద్ర కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా అనేక జానర్లలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి విభిన్న జానర్లలో ఆయన అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హేమ మాలినితో ఆయన రొమాంటిక్ కెమిస్ట్రీ అద్భుతంగా పండేది. ఇక 'చాచు మామా' వంటి సినిమాలతో ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆయన దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించారు. భారతీయ సినీ చరిత్రలో ఈ మైలు రాయిని అతి కొద్ది మంది నటులు మాత్రమే అందుకున్నారు. దశాబ్దాలుగా ఆయన నటన కొనసాగుతూనే వచ్చింది. ధర్మేంద్ర చివరిగా నటించిన సినిమా 'ఇక్కిస్' త్వరలో విడుదల కానుంది. యుద్ధ నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో ఆయన ఏ పాత్ర పోషించారు.. ఆయన నటన ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   1993లో ధర్మేంద్ర విజయత ఫిల్మ్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్‌ని స్టార్ట్ చేశాడు. కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లు కలిసి నటించిన సక్సెస్‌ఫుల్ సినిమాలు బేతాబ్, బర్సాత్ వంటి సినిమాలను ఈ బ్యానర్ కింద నిర్మించాడు. రీసెంట్‌గా మనవడు కరణ్ డియోల్‌ని సైతం ఈ బ్యానర్ కిందే ఇంట్రడ్యూస్ చేశాడు. పాల్ పాల్ దిల్ కే పాస్ సినిమాతో కరణ్ డియోల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.   ధర్మేంద్ర ప్రధానంగా ముంబైలో నివసించేవాడు. కానీ తరచుగా లోనావాలాలోని తన 100 ఎకరాల ఫామ్‌హౌస్‌కు తిరిగి వెళ్లేవాడు. అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో కూడిన స్విమ్మింగ్ పూల్ సహా ఎన్నో మోడర్న్ ఫెసిలిటీలు అక్కడ ఉన్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.17 కోట్లకు పైనే ఉంటుందని చెబుతుంటారు. ధర్మేంద్రకు వింటేజ్ కార్లు అంటే చాలా ఇష్టం. తన ఇష్టానికి అనుగుణంగా వింటేజ్ ఫియట్, రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్.ఎల్ 500 వంటి కార్లను గ్యారేజీలో పెట్టుకున్నాడు.  ధర్మేంద్ర వ్యక్తిగత నెట్‌వర్త్‌ రూ.450 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇక డియోల్ కుటుంబ సభ్యుల మొత్తం సంపద రూ.1000 కోట్లకు పైమాటే. ఇందులో సన్నీ డియోల్ (రూ.130 కోట్లు), బాబీ డియోల్ (రూ.60 కోట్లు), అభయ్ డియోల్ (రూ.400 కోట్లు), కరణ్ డియోల్ (రూ.40-50 కోట్లు) ఉన్నారు. యాక్టింగ్‌తో పాటు ఆయన హాస్పిటాలిటీ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టాడు. గరం ధరమ్ ధాబా, హీ-మ్యాన్ వంటి రెస్టారెంట్లను స్టార్ట్ చేశాడు.

ఇంకా చదవండి: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# బాలీవుడ్‌     # ధర్మేంద్ర    

trending

View More