‘చాయ్ వాలా’ నుంచి తొలి పాట ‘సఖిరే..’ విడుదల
2 months ago | 5 Views
వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్, ప్రామిసింగ్ యాక్టర్ శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ గురువారం రోజున తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది.
క్యాచీ ట్యూన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేష్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ పాడారు. ప్రేయసిపై గుండెలనిండా స్వచ్చమైన ప్రేమను నింపుకున్న హీరో తన భావాలను అందంగా ఈ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నారు. హీరో శివ కందుకూరి స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ తేజు అశ్విని బ్యూటీతో చూపులు తిప్పుకోనీయటం లేదు. ఈ మెలోడీలో రొమాంటిక్ మూమెంట్స్ విజువల్ ట్రీట్‌లా ఉంది. పాట అందరూ పాడుకునేలా ఉంది. కపిల్ కపిలన్ గొంతు నుంచి వచ్చిన ఈ పాట మరింత మాధుర్యంగా అనిపిస్తోంది. ప్రేమించేవాళ్లకు, మ్యూజిక్ లవర్స్‌కు ఈ పాట బాగా కనెక్ట్ అవుతుంది. ప్రమోద్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్.విహారి సంగీతాన్ని అందిస్తున్నారు. క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి పవన్ నర్వ ఎడిటర్.
ఇంకా చదవండి: 'లిటిల్ హార్ట్స్' నవ్వించింది - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# చాయ్ వాలా # శివ కందుకూరి # సఖిరే




