‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల

‘ఫంకీ’ చిత్రం నుంచి తొలి పాట ‘ధీరే ధీరే’ విడుదల

8 days ago | 5 Views

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో వస్తున్న చిత్రం 'ఫంకీ'. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ విడుదలైంది.

'ఫంకీ' చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తొలి పాట ‘ధీరే ధీరే’కి అద్భుతమైన సంగీతం అందించి, విడుదలైన తక్షణమే శ్రోతల మనసులో చోటు సంపాదించుకునేలా చేశారు. ఈ మధురమైన పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం.

వినసొంపుగా ఉన్న ఈ ‘ధీరే ధీరే’ మెలోడి, వినగానే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయేలా ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహార్ జోడి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాటలో కొత్తదనం ఉట్టిపడటమే కాకుండా, యువతకు చేరువయ్యేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో శైలి సంగీతానికి శ్రోతలలో ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆయన శైలిలో సాగిన ఈ ‘ధీరే ధీరే’ పాట తక్షణ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

నవ్వులు, గందరగోళం, స్వచ్ఛమైన వినోదానికి పేరుగాంచిన అద్భుతమైన కలయికలో 'ఫంకీ' రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు కె.వి. అనుదీప్ తన శైలి కామెడీ విందుతో తిరిగి వచ్చారు. ఈసారి రెట్టింపు నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. అనుదీప్ దర్శకత్వం అంటే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. 'జాతిరత్నాలు' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన.. మరోసారి విభిన్నమైన కథాంశం, కట్టిపడేసే హాస్యంతో ప్రేక్షకుల మనసు దోచుకోనున్నారు.


భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది. కాలు కదిపే పాటలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలి పాట ‘ధీరే ధీరే’తో ఆ విషయాన్ని రుజువు చేశారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీతనానికి, విజయవంతమైన చిత్రాలకు పేరుగాంచిన నిర్మాణ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ఫంకీ'పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా 'ఫంకీ' చిత్రం ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.

విశ్వక్ సేన్-కయాదు లోహార్ సరికొత్త జోడి, విభిన్న పాత్రలు, ఉత్సాహభరితమైన సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి పేరొందిన దర్శకుడు.. ఈ అన్ని అంశాలతో 'ఫంకీ' చిత్రం వెండితెరపై అపరిమిత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెడుతున్న 'ఫంకీ' చిత్రం, ప్రేక్షకులకు వినోదాల విందుని అందించనుంది.

చిత్రం: ఫంకీ

తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్‌, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు

దర్శకత్వం: అనుదీప్ కె.వి.

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

కూర్పు: నవీన్ నూలి

ఛాయాగ్రహణం: సురేష్ సారంగం

రచన: అనుదీప్ కె.వి, మోహన్

కళా దర్శకుడు: జానీ షేక్

నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్

సమర్పణ: శ్రీకర స్టూడియోస్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

ఇంకా చదవండి: 'ఈషా' థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిమ్మలను చాలా కాలం వెంటాడుతుంది: హీరో శ్రీవిష్ణు

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఫంకీ     # విశ్వక్ సేన్    

trending

View More