‘దండోరా’ మూవీ నుంచి లవ్ సాంగ్ ‘పిల్లా..’ లిరికల్ వీడియో విడుదల
4 days ago | 5 Views
ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పడాల్సిందే. ఐ లవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోనని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మనసు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ‘దండోరా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. హ్యుమర్ టచ్‌తో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాను మేకర్స్ మన ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం తెలిసింది. ఇలా ఇప్పటికే డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను అలరించిన ‘దండోరా’ నుంచి లేటెస్ట్‌గా ‘పిల్లా...’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది.
‘‘దండోరా కొట్టుకుందురో.. గుండెల్లో కొత్తగుందిరో
నింగి నేల ఇలా..దారి కుదిరిందెలా
కళ్లారా చూడబోతినో.. కల్లోలం లాగ ఉంటదే
దాగి దాగి అలా దగ్గరైపోయావే ఇలా
పిల్లా ఇట్టసూడవే.. తొంగి నన్ను చూడవే..’’ అంటూ సాగే ఈ పాట మనసుల్ని హత్తుకుంటోంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటను పూర్ణా చారి రాశారు.
ప్రేమికుల మనసుల్లో దాగిన భావాలను అందంగా ఆవిష్కరించిన పాట ఇది.
దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. టీజర్‌తో దర్శకుడు బలమైన అంశాన్ని చెప్పాలనకుంటున్నాడనే విషయం తెలుస్తుంది. సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. అథర్వణ భద్రకాళి పిక్చర్స్ సినిమాను ఓవర్‌సీస్ రిలీజ్ చేస్తోంది.
నటీనటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: క‌్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టెవెన్‌సన్ పెరెజి
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్
ఆడియో: T-సిరీస్
ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
ఇంకా చదవండి: రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో “సఃకుటుంబానాం” ట్రైలర్ విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# దండోరా # అదితి భావరాజు # శివాజీ




