అల్లరి నరేష్ '12A రైల్వే కాలనీ' నుంచి కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్

అల్లరి నరేష్ '12A రైల్వే కాలనీ' నుంచి కన్నొదిలి కలనొదిలి సాంగ్ రిలీజ్

1 month ago | 5 Views

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ కన్నొదిలి కలనొదిలి సాంగ్ విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్ ని అందంగా హైలైట్ చేస్తుంది. భీమ్స్ సాఫ్ట్ కంపోజింగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్ ఈ పాట అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. ఆయన వాయిస్ మ్యాజిక్ లా వుంది. దేవ్ పవార్ సాహిత్యం అద్భుతంగా వుంది. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ లవ్లీగా వుంది. విజువల్స్ చాలా ప్లజెంట్ గా వున్నాయి.  

ఇప్పటికే విడుదలైన టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచాయి. 12A రైల్వే కాలనీని ఎమోషన్స్, ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా,  మధుమణి కీలక పాత్రలు పోషించారు.


కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ఎ  దర్శకుడు నాని కాసరగడ్డ స్వయంగా ఎడిటర్ గా చేస్తున్నారు.  

నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

సమర్పణ: పవన్ కుమార్

కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ & షోరన్నర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్

ఎడిటర్ & డైరెక్టర్: నాని కాసరగడ్డ

డిఓపి: కుశేందర్ రమేష్ రెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

VFX: త్రివేణి కాసరగడ్డ (నియో స్టూడియోస్)

సౌండ్ డిజైన్: రఘునాథ్

DI: అన్నపూర్ణ స్టూడియోస్

కలరిస్ట్ : రఘు తమ్మారెడ్డి

సౌండ్ మిక్స్ ఇంజనీర్: కృష్ణ రాజ్ ఆర్ముగం

PRO: వంశీ శేఖర్

మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట
ఇంకా చదవండి: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే 'ఆంధ్రా కింగ్ తాలూకా' నుంచి మెస్మరైజింగ్ మెలోడీ చిన్ని గుండెలో రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అల్లరి నరేష్     # సాంగ్    

trending

View More