" తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా నుండి నాన్న నీకు ప్రేమతో అనే సాంగ్ విడుదల
4 months ago | 5 Views
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రంలోని నాన్న నీకు ప్రేమతో అనే సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్. ఈ చిత్రంలో పాటలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ఈరోజు ముఖ్యంగా మా సంగీత దర్శకులు అజయ్ పట్నాయక్ నటించిన" నాన్న నీకు ప్రేమతో" అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ పోస్టులు పనులన్నీ జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సలహాలు చేస్తున్నాం. అన్నారు
నిర్మాత శరత్ బాబు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా పేరులో గుర్తులేదు ఉంది గానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. మా మూవీకి సపోర్ట్ గా నిలుస్తున్న పృథ్వీ గారికి థ్యాంక్స్. అలాగే యంగ్ అండ్ ఎనర్జిటిక్ టీమ్ తో సినిమా నిర్మిస్తున్నాం. ఫస్ట్ చిత్రంతోనే ఒక సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తామని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
నటీనటులు - నివాస్, అమిత శ్రీ, 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, జెమిని సురేష్, భరద్వాజ్, ఖయ్యూం, సునీల్ రావి నూతల తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ - అభిలాష్, ఎం
సంగీతం- అజయ్ పట్నాయక్
పీఆర్ఓ - బి. వీరబాబు.
బ్యానర్ - చెన్నా క్రియేషన్స్
నిర్మాత - శరత్ చెన్నా
దర్శకత్వం - వెంకటేష్ వీరవరపు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




