'మేఘం వర్షించదా..' అంటున్న జంట ‘అర్జున్ చక్రవర్తి' నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్
3 months ago | 5 Views
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. యూట్యూబ్ లో 1.5 మిలియన్లు వ్యూస్ దాటింది. ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా రిలీజ్ చేసి ‘అర్జున్ చక్రవర్తి' మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా వుంది. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ తమ మ్యాజికల్ వాయిస్ తో కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా వుంది. అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాతో పాటు హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో అర్జున్ చక్రవర్తి అలరించబోతుందని ఈ సాంగ్ ప్రామిస్ చేస్తోంది.
ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు,
ఈ చిత్రానికి జగదీష్ చీకాటి డీవోపీ, ప్రదీప్ నందన్ ఎడిటర్ , సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్.
ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్
సిబ్బంది వివరాలు:
రచన & దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
నిర్మాత: శ్రీని గుబ్బల
సహ నిర్మాత: ఈడే కృష్ణ చైతన్య
సంగీతం: విఘ్నేష్ బాస్కరన్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకాటి
ఎడిటర్: ప్రదీప్ నందన్
ప్రొడక్షన్ డిజైనర్: సుమిత్ పటేల్
ఆడియోగ్రఫీ: అరవింద్ మీనన్
సాహిత్యం: కృష్ణకాంత్
డైలాగ్స్ రైటర్: రవీంద్ర పుల్లె
కాస్ట్యూమ్ డిజైనర్: పూజిత తాడికొండ
సౌండ్ డిజైన్: విఘ్నేష్ బాస్కరన్, నిర్మల్ శ్రీనివాసన్
కలర్స్: విష్ణు వర్ధన్ (శ్రీ సారథి స్టూడియో)
పబ్లిసిటీ డిజైన్: స్కేల్ & టిల్ట్ స్టూడియోస్
పీఆర్వో : తేజస్వి సజ్జా
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
Read Also: ‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేసిన టీం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అర్జున్ చక్రవర్తి # విజయ రామరాజు




