బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని యాడ్ చేస్తే బెల్లీ ఈజీగా తగ్గుతుంది..

బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని యాడ్ చేస్తే బెల్లీ ఈజీగా తగ్గుతుంది..

9 months ago | 5 Views

ఇప్పుడు చాలామంది ఏమి తిన్నా తమ బెల్లీ పెరిగిపోతుంది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎంత డైటింగ్ చేసినా బెల్లీ మాత్రం త్వరగా తగ్గదు. అందుకే అది ఎలా తగ్గించుకోవాలి అని ఎంతోమంది ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని యాడ్ చేస్తే బెల్లీ ఈజీగా తగ్గుతుందట.

రోజు మొత్తంలో బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే బ్రేక్ ఫాస్ట్ మాత్రం రాజు లాగా తీసుకోమని పెద్దది అంటూ ఉంటారు. ఇది ఎంత హెల్దీగా తీసుకుంటే అంత మంచిది. కేలరీలు, చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. తక్కువ కేలరీలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా వివరిస్తున్నారు. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది.

మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా వివరిస్తున్నారు. ఇది బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్‌ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే భోజనం జీవక్రియని పెంచుతుంది. కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల రోజు మొత్తం తినడం తగ్గుతుంది. ఇక ప్రోటీన్ ఎక్కువగా ఉన్న టిఫన్లు ఏమిటి అంటే.. 


దోశ, ఇడ్లీ..

దోశ, ఇడ్లీ చేసినా ప్రోటీన్ కోసం పల్లీలతో చట్నీ చేయండి. దీని వల్ల శరీరానికి ప్రోటీన్ అందుతుంది.

వేరుశనగ, బఠానీలు, పనీర్, శనగలు సహా ప్రతి ఒక్కటి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్. వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వేరుశనగలు ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఉప్మా..

ఉప్మాలో కూడా మీకు నచ్చినట్టుగా బీన్స్, పల్లీలు వేయాలి. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.

పరాఠా..

పరాఠాల్ని గోధుమ పిండి, శనగపిండితో చేయొచ్చు. ఇందులో స్టఫింగ్ కోసం శనగలు, పనీర్, బఠానీలను వేయండి. 

ఇంకా చదవండి : వారం రోజుల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే డ్రాగన్ ఫ్రూట్ రహస్యం 

# Breakfast    

trending