ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే డిప్రెషన్ మీ దరి చేరదు.

ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే డిప్రెషన్ మీ దరి చేరదు.

9 months ago | 5 Views

ప్రస్తుతం యువతి యువకులు డిప్రెషన్ కి ఎక్కువగా లోన్ అవుతున్నారు. ఇది ముఖ్యంగా వారి జీవన శైలి వల్ల అలానే వారి పైన పడుతున్న స్ట్రెస్ వల్ల అని రకరకాల కారణాలు అనుకుంటూ ఉంటాము.

మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే మానసిక అనారోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అయితే చాలా సార్లు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో ఆటంకాలు, క్రమరహిత జీవనశైలి దీని వెనుక కారణమని భావిస్తారు. కారణం ఏది అయినా ప్రస్తుతం మన జీవనశైలిని బట్టి ఈ డిప్రెషన్ కొన్ని ఫుడ్స్ ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు మానసిక వైద్య నిపుణులు. నిత్యం ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

ఆకుకూరలు 

ఆకుకూరల్లో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పాలకూర. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి న్యూట్రియంట్లు మెదడులో ఆక్సిజన్ స్థాయిని పెంపొందిస్తాయి. అదే సమయంలో హ్యాపీ హార్మోన్ విడుదల చేస్తాయి. దీంతో చికాకు వంటివి దూరమౌతాయి. వారంలో కనీసం 3 సార్లు పాలకూర ఉండేట్టు చూసుకోవాలి. 

వాము

 ప్రతి వంట ఇంట్లో తప్పకుండా లభించే పదార్ధమిది. ఇదొక ఆయుర్వేద మసాలా పదార్ధం. కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు వాము విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. అయితే వాముతో మూడ్ కూడా సరి చేసి మానసిక సమస్యల్ని దూరం చేయవచ్చని చాలా తక్కువమందికి తెలుసు. వాము నీరు తాగడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.


బ్రోకలీ

కాలిఫ్లవర్ లేదా క్యాబేజ్ జాతికి చెందిన బ్రోకలీ లీ‌ఫీ వెజిటబుల్ విభాగంగా ప్రముఖంగా చెప్పుకోవల్సిన ఫైబర్ రిచ్ పదార్ధం. ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రోకలీలో ఉండే ఫోలేట్ డిప్రెషన్౨ను దూరం చేసేందుకు దోహదపడుతుంది. 

డ్రై ఫ్రూట్స్

ఒత్తిడిని అధిగమించే పదార్ధాల్లో డ్రై ఫ్రూట్స్ ముందుగా చెప్పుకోవాలి. ఇందులో బాదం మరీ కీలకం. రోజూ నిర్ణీత పద్థతిలో బాదం, వాల్‌నట్స్, అంజీర్, పిస్తా వంటివి తింటుంటే మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఏ విధమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశముండదు.


# Health Tips    

trending