RO వాటర్ ఎక్కువగా తాగుతుంటే. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

RO వాటర్ ఎక్కువగా తాగుతుంటే. తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.

9 months ago | 5 Views

మనము ఎంత మంచినీరు తాగితే అంత మంచిది. వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. అయితే ఏ వాటర్ పడితే ఆ వాటర్ తాగితే ప్రమాదాలు కూడా వస్తాయట. ఇక ప్రస్తుతం అందరూ ఎక్కువగా RO వాటర్ తాగుతారు అన్న సంగతి మనకు తెలిసిందే. మీరు కూడా ఆర్ ఓ వాటర్ తాగే వారు అయితే కింద విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే.

ఈ నీరుని రివర్స్ ఆస్మోసిస్ ( Reverse Osmosis ) చేసి డైరెక్టుగా ఇచ్చేస్తారు. మినరల్స్ కలపకుండా ఇచ్చే ఈ ఆర్వో వాటర్ ను కొనుక్కోని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. భూమిలోంచి వచ్చేనీరు డైరెక్టుగా తాగలేం కాబట్టి, ఫిల్టర్స్ గురించి మినరల్స్ గురించి ఆలోచించాల్సి వచ్చింది. మనం తాగేనీరులో టీడీఎస్ చూసుకుని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాగమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొలతలు ఇచ్చారు. టోటల్ డిస్వాల్డ్ సాలిడ్స్ (TDS) . 

నీళ్లలో ఉండే లవణాల మోతాదు ఏ రేంజ్ లో ఉంటే మంచిది అని WHO ఇచ్చిందంటే.. 50-150PPM ఉండాలి. పార్ట్స్ పర్ మిలియన్స్ . అలా ఉంటే.. ఆ వాటర్ ఎక్సలెంట్ అని అర్థం. 150-300 వరకు ఉంటే గుడ్ అని అర్థం. 300-500 మధ్యలో టీడీఎస్ ఉంటే..ఒకే తాగొచ్చు. అంతకు పైన ఉంటే.. ఇక తాగొద్దు. 1000దాటితే అసలకే తాగొద్దు. 


ఆర్వో అంటే..రివర్స్ ఆస్మోసిస్..ఇందులో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి..ఆ ఫిల్టర్స్ ఎంత మైక్రాన్స్ ఉంటాయంటే.( .0001మైక్రాన్) అంత పలచటవి.. నీరు తప్ప ఇక ఏవి ప్రయాణించడానికి అ‌వకాశం ఉండదు. అలాంటి ఫిల్టర్స్ గుండా వాటర్ ను పంపినప్పుడు నీరు ఒక్కటే వెళ్లి మిగతావి అన్ని నీళ్లల్లో ఉండే లవణాలు, క్రిముల్ని ఆపేస్తాయి. 

అంతకంటే చిన్న వైరస్ బాక్టీరియాలను ఉంటే అవి మాత్రం ప్రయాణిస్తాయి. ఇలా రిమూవ్ చేస్తున్నాం కాబట్టి.. ఆర్వో ఫిల్టర్స్ మినరల్స్ ఉండవు. అందుకని ఆర్వో ఫిల్టర్స్ నుంచి మినరల్స్ యాడ్ చేసేటట్టు టీడీఎస్ సంబంధించిన మిషన్లు పెట్టి వీటిని మళ్లీ తిరిగి యాడ్ చేస్తారు. అలా మినరల్స్ యాడ్ చేసిన ఆర్వో వాటర్ ను మనం త్రాగితే దోషం తక్కువ ఉంటుంది.

కాబట్టి కొంచెం ఈ విషయాలు తెలుసుకొని RO వాటర్ ఫిల్టర్ కి ప్రాధాన్యత ఇవ్వండి. 

ఇంకా చదవండి : బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని యాడ్ చేస్తే బెల్లీ ఈజీగా తగ్గుతుంది.. 

# RO Water    

trending