21న తెలుగులో  'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్'  - 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమా

21న తెలుగులో 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' - 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమా

20 days ago | 5 Views

వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్' మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ నెల 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా.  ఈ నెల 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను." అని అన్నారు.

దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. "క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. చాగంటి ప్రొడక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

డైరెక్టర్ వంశీకృష్ణ, మాట్లాడతూ.. "హరి హారన్, చిత్ర వంటి దిగ్గజలు ఈ సినిమాలో పాడారు. ఇలాంటి మానవత్వం కలిగిన ప్రపంచ స్థాయి సినిమాలను ప్రతీ ఒక్కరూ సపోర్ట్ చేద్దాం. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం." అని అన్నారు.


ఈ సమావేశంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్,  సి.ఎస్.ఐ బిషప్ విల్సన్, 

నటుడు జక్కుల కృష్ణ మోహన్ మాట్లాడుతూ... "ఈ సినిమాలో ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. నవంబర్ 21న తెలుగు వెర్షన్ ను కూడా భారీ స్థాయిలో హిట్ చేద్దాం" అని అన్నారు.

కాథలిక్ మత సోదరి, సామాజిక కార్యకర్త  సీనియర్ రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది, ఆమె పేదల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేసింది. ఈ చిత్రం సీనియర్ రాణి మరియా వట్టలిల్ ఎదుర్కొన్న కష్టాల గురించి. ఆమె అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేసింది. ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్‌లో విన్సీ అలోషియస్ సీనియర్ రానియా మరియా పాత్రను పోషించారు.

ఇంకా చదవండి: డివైన్ ఫిల్మ్స్ లో అనాంత కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది: డైరెక్టర్ సురేష్ కృష్ణ మాటలు

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ఆస్కార్     # ది ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్    

trending

View More