డివైన్ ఫిల్మ్స్ లో అనాంత కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది: డైరెక్టర్ సురేష్ కృష్ణ మాటలు

డివైన్ ఫిల్మ్స్ లో అనాంత కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది: డైరెక్టర్ సురేష్ కృష్ణ మాటలు

21 days ago | 5 Views

ఆడియో& టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్  సురేష్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఎన్నో ఏళ్లుగా నేను సినిమాలు చేస్తున్నాను. ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఇంతకాలం నేను ఏం పొందాను అని ఆలోచిస్తుంటే ప్రేమని పొందాను, ప్రేమను పంచాను అనిపించింది. ఒక్క ఫోన్ కాల్ లో మీరంతా వచ్చారు. అది ప్రేమ. ఈ సినిమా కూడా ఆ ప్రేమతోనే వచ్చింది. బాబా గారి గురించి ఒక బయోపిక్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఆయన ఆశ్రమం కి వెళ్ళాను. ఆయన నన్ను చూసి 'ఇంతకాలం ఎందుకు రాలేదు' అని అడిగారు. నేను ఆయన కాళ్ళకి నమస్కరించాను. అది నా మనసుని ఎంతో కదిలించింది. 2011లో ఆయన చనిపోయారు. తర్వాత నేను నా రొటీన్ లో పడిపోయా. గత ఏడాది జూన్లో ఒక కల వచ్చింది. ఆయన కలలోకి వచ్చి విభూదిని ఇచ్చా. బాబా గారి దగ్గరికి నన్ను మొదటిసారి తీసుకెళ్లిన వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు ఆయన మేము పుట్టపర్తి లో ఉన్నాం మీ గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. ఒకరోజు గిరీష్ కృష్ణమూర్తి గారు ఫోన్ చేసి బాబా గారి జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. నేనే ఎందుకు ఈ సినిమా డైరెక్టర్ చేయాలని అడిగినప్పుడు.. బాబా గారు కలలోకి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని చెప్పారు అన్నారు. బాబాగారి శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరారు. కానీ ఆ సినిమాలో బాబాలాగా ఎవరూ నటించకూడదన్నారు. అప్పుడు నా దగ్గర స్క్రిప్ట్ కూడా లేదు. అనుకోకుండా ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది. ఏదో భక్తి సినిమాలా కాదు. బాషా సినిమా లాంటి కమర్షియల్ స్క్రిప్ట్ వచ్చింది. జగపతిబాబు గారికి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయనకు  చాలా నచ్చింది. అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ చూసినప్పుడు సూపర్ గా అనిపించింది. సుహాసిని గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. అందరూ కూడా  అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. దేవా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. శాస్త్రి గారు రాసిన పాట అద్భుతంగా వచ్చింది. కాశీ, చెన్నై, హైదరాబాద్, పుట్టపర్తి  ఇలా అద్భుతమైన లొకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం. ఇది  మామూలు డివైన్ లాగా ఉండదు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాబా గారికి ప్రేమే మతం. కమర్షియల్ సినిమాస్ లో బాషా ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో డివైన్ ఫిలిమ్స్ లో అనంత అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుంది.

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారు గొప్ప దర్శకులు. సినిమా అంటే ఎంతో ప్రేమ. ఆయన ఎప్పుడూ కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అనంత సినిమాతో వస్తున్నారు. సాయిబాబా తనని నమ్మిన వారందరిని ప్రేమించాడు. నమ్మినా నమ్మకపోయినా ఆయన సేవలు అందించారు. విద్య వైద్యం నీరు ఆయన పరిధిలో చేయగలిగినంత చేశారు   సురేష్ కృష్ణ ఎప్పుడు కూడా మంచి సినిమా తీస్తాడు. ఈ సినిమా కూడా అందరూ చూడాలని చూస్తారని కోరుకుంటున్నాను.

సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ.. అందరికి సురేష్ కృష్ణ గారి వేడుకలో నేను భాగం అవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇండియన్ సినిమా బిఫోర్ బాషా ఆఫ్టర్ బాషా. అలాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు.  అనంత సినిమాని జనాలకి చూపించాలని గొప్ప ఉద్దేశంతో అంకిత భావంతో తీసిన సినిమా. సత్య సాయి బాబా గారి ప్రేమతత్త్వం అందరికీ పంచాలనే మనస్తత్వం ఉంటే తప్పితే ఇలాంటి సినిమా చేయలేం. ఇలాంటి సినిమాలు కి మీడియా మిత్రులు కూడా మరింత సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ చూసే సినిమా ఇది. ఆధ్యాత్మికత చాలా అవసరం. మనిషికి భయం భక్తి రెండు ఉండాలి. పాపభీతి ఉండాలి. భక్తి భావం అందరిలోనూ ప్రచారం అవ్వాలి. ఈ సినిమా కమర్షియల్ కూడా అద్భుతమైన విజయం సాధించి మరిన్ని సినిమాలు రావడానికి ఇన్స్పిరేషన్ గా నిలవాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారు ఐకానిక్ డైరెక్టర్. ఆయన అన్ని భాషల్లో సినిమాలు చేశారు. ఆహా సినిమా చేసినప్పుడు ఆయనని క్లోజ్ గా చూడడం జరిగింది. ఆయన చూసినప్పుడు డైరెక్టర్స్ ఉంటే ఇంత క్లాస్ గా ఉండాలి అనిపించేది. భక్తి ప్రేమతో ప్రపంచాన్ని తన వైపుకు తీసుకొచ్చిన బాబా గారి నేపథ్యంలో ఈ సినిమా చేయడం అనేది గొప్ప విషయం. ఈ సందేశం ప్రేక్షకులు అందరికీ చేరి ఎంతో మంది స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను. సురేష్ కృష్ణ గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను

రాకేందు మౌళి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. శాస్త్రి గారు అద్భుతమైన పాట రాశారు. డైరెక్టర్ సురేష్ కృష్ణ గారి గురించి చెప్పేంత అనుభవం వయసు నాకు లేదు. ఆయన సినిమాలన్నీ థియేటర్లో చూశాను. సురేష్ గారు మా నాన్నగారు కలిసి పనిచేశారు. అలాంటి ఆయనతో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అందరిపై గురు కృప ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగించే సినిమా ఇది.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమాతో బాబా ప్రేమ సందేశం మరింత మందికి చేరువవుతుంది. ఎందుకంటే సంకల్పం అంత గొప్పది. ఇంత మంచి ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. బాబా గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా తీసిన సినిమా ఇది.తప్పకుండ అందరికీ నచ్చుతుంది.

శ్రీ రజిని మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ సినిమాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అనంత  టీజర్  సాంగ్స్ చూస్తున్నప్పుడు చాలా గొప్ప అనుభూతి కలిగింది.  సురేష్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇదంతా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను.  

చోటా కె నాయుడు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సురేష్ కృష్ణ గారంటే నాకెంతో గౌరవం. దాసరిగారి తర్వాత నాకు మరో గురువు. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఒక గొప్ప వ్యక్తి మీద సినిమా చేశారు. సురేష్ గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నీ వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఇంకా చదవండి: ఫ్యూర్ నేటివ్ ఎమోషనల్ లవ్ స్టోరీ "రాజు వెడ్స్ రాంబాయి" ట్రైలర్ 2025

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సురేష్ కృష్ణ     # అనంత    

trending

View More