నీ ప్రేమ నిరంతర ప్రయాణం విఘ్నేష్‌కు విషెస్‌ చెప్పిన నయనతార

నీ ప్రేమ నిరంతర ప్రయాణం విఘ్నేష్‌కు విషెస్‌ చెప్పిన నయనతార

5 months ago | 5 Views

కోలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్స్‌లో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ జంట ఒకటి. సుమారు ఏడేండ్ల పాటు  ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లయిన  4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్‌, విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రుల య్యారు.  ఈ జంట మూడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా విఘ్నేశ్‌ శివన్‌కు నయన్‌ సోషల్‌ విూడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేశ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ.. క్యూట్‌ ఫొటోలను కూడా పంచుకుంది..ఒకరిపై ఒకరు అంతగా ఎలా ప్రేమ చూపుతారే? ఇది ఎప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యపరిచే విషయం. కానీ.. నీ రూపంలో దానికి నాకు సమాధానం దొరికింది.

Nayanthara initiated her love story with Vignesh Shivan: I looked at him  differently - India Today

నీ ప్రేమను వర్ణించడానికి నాకు మాటలు చాలవు. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు’ అంటూ నయనతార శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు నయన్‌-విఘ్నేశ్‌ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇంకా చదవండి: కెరీర్‌ ఈ స్థాయలో ఉందంటే అదృష్టమే: అవికా గోర్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# నయనతార     # విఘ్నేశ్‌ శివన్‌    

trending

View More