కెరీర్‌ ఈ స్థాయలో ఉందంటే అదృష్టమే: అవికా గోర్‌

కెరీర్‌ ఈ స్థాయలో ఉందంటే అదృష్టమే: అవికా గోర్‌

5 months ago | 5 Views

యంగ్‌ హీరోయిన్‌ అవికా గోర్‌ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నారి 'పెళ్లికూతురు' సిరియల్లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'ఉయ్యాల జంపాల’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన అవికా గోర్‌.. అనంతరం వరుస సినిమాలు తీసినప్పటికి, హీరోయిన్‌గా భారీ స్టార్‌ డమ్‌ మాత్రం అందుకోలేకపోయింది. అయనప్పటకి ఈ అమ్మడు ఫలితం ఆశించకుండా లైన్‌ గా సినిమాలు సిరీస్‌లు తీస్తునే ఉంది.

Avika Gor set for B-town debut in Vikram Bhatt's '1920- Horrors of the  Heart'

అయితే ఇటివల ఓ అవార్డ్‌ ఫంక్షన్ లో  మాట్లాడిన అవికా కాస్త ఎమోషనల్‌ కామెంట్స్‌ చేసింది.. 'బాలికా వధు’తో మొదలైన నా కెరీర్‌ ఈ స్థాయికి ఎదగడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకులు ఈ రోజు నాకు ఈ స్థాయినిచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అధికారిక శిక్షణ లేదా చిత్ర పరిశ్రమ నేపథ్యం లేకుండానే ఈ స్టెజ్‌లో ఉన్నాను. కనీసం నాకు ఇంటి నుంచి కూడా సరైన మద్ధతు లేదు. అయినా నటిగా ఒక స్థాయికి ఎదిగినందుకు ఆనందంగా ఉంది. మంచి పాత్రలు వచ్చినప్పుడు బాధ్యతగా నటించి విజయం అందుకునేలా చేయడం ఆర్టిస్టు బాధ్యత. టెలివిజన్‌ లేదా సినిమా ఏదైనా సరే నేను ఒకే విధంగా పని చేస్తాను. నేను దానిని తేలికగా తీసుకోలేను. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న స్థాయికి చేరతానని తెలిపింది అవికా.

ఇంకా చదవండి: మణిరత్నంతో సినిమా చేయాలని ఉంది : అవిూర్‌ ఖాన్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అవికా గోర్‌    

trending

View More