షైన్ టామ్ చాకోని పరామర్శించిన మంత్రి సురేశ్ గోపి
6 months ago | 5 Views
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మలయాళ నటుడు, ‘దసరా’ సినిమా విలన్ షైన్ టామ్ చాకోని కేంద్ర మంత్రి సురేశ్ గోపి పరామర్శించారు. త్రిస్సూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రి.. అక్కడ టామ్ చాకోని కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అక్కడి వైద్యులతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం నటుడు, అతని ఫ్యామిలీ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కాగా, ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
గురువారం రాత్రి తన తండ్రి, తల్లి, సోదరుడితో కలిసి టామ్ చాకో కేరళ రాష్ట్రం తిరుచ్చూర్ నుంచి బెంగళూరుకు కారులో బయల్దేరారు. శుక్రవారం ఉదయం తమిళనాడులోని ధర్మపురి సమీపంలో హోసూర్ జాతీయ రహదారిపై వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షైన్ టామ్ చాకో, ఆయన సోదరుడు, తల్లి గాయపడ్డారు. పాలక్కోడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రులను ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. షైన్ టామ్ చాకో తెలుగులో నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘దసరా’ సినిమాలో విలన్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు.
ఇంకా చదవండి: కోలీవుడ్‌లో నెంబర్‌వన్‌గా మమిత బైజు




