మణిరత్నంతో సినిమా చేయాలని ఉంది : అవిూర్‌ ఖాన్‌

మణిరత్నంతో సినిమా చేయాలని ఉంది : అవిూర్‌ ఖాన్‌

5 months ago | 5 Views

తరచు వార్తలో నిలిచే బాలీవుడ్‌ స్టార్‌ హీరోలో అవిూర్‌ ఖాన్‌ ఒకరు. హింది తో పాటు తెలుగు, తమిళం భాషలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్‌ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం 'సీతారే జవిూన్‌ పర్‌ ’ అనే చిత్రంతో  జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజంట్‌ ఈ సినిమా  ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Shah Rukh Khan BEGS Mani Ratnam To Cast Him In His Film: 'Will Dance On  Plane If You Tell Me'

అవిూర్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. 'సౌత్‌లో నాకు మణిరత్నం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన మంచి విజనరీ. ఎలాంటి సినిమాలను అయినా చాలా బ్యాలెన్స్‌ చేయగలరు.. చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆయనను కలుస్తుంటాను. ఎన్నో సార్లు మేమిద్దరం కలిసి పని చేయాలని అనుకున్నాం కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చేది.  ఓ సారి మా ఇద్దరి కాంబోలో 'లజో’ అనే సినిమా  కూడా అనుకున్నాం. కానీ, అనుకోని కారణాలతో అది చేయలేకపోయాం. కానీ ఎన్నటికైనా మణిరత్నం గారితో చిత్రం  చేయాలని ఉంది. అది భవిష్యత్‌లో నెరవేరుతుందనే ఆశ నాకుంది ’ అంటూ అవిూర్‌ ఖాన్‌ మణిరత్నం గురించి క్రేజీ కామెంట్స్‌ చేశాడు. ప్రజంట్‌ ఈ మాటలు వైరల్‌ అవుతున్నాయి.

ఇంకా చదవండి: డెహ్రాడూన్‌ చేరుకున్న చిరంజీవి అనిల్‌ రావిపూడి టీం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మణిరత్నం     # అవిూర్‌ ఖాన్‌    

trending

View More