విశ్వక్‌సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'!

విశ్వక్‌సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'!

12 days ago | 14 Views

టాలీవుడ్‌ మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'గామి' సినిమాతో హిట్‌ కొట్టిన ఈ కుర్ర హీరో తాజాగా మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు. విశ్వక్‌సేన్‌ ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'.   ఈ మూవీకి 'ఛల్‌ మోహన్‌ రంగ' ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. 'డీజే టిల్లు' ఫేం నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అనంతరం మే 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గోదావరి అంత సాహసం ఎందుకు చేస్తుంది

ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్‌ టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్‌ 27 సాయంత్రం 4.01 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్‌ ఫోర్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. అంజలి మరో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. విశ్వక్‌సేన్‌ మరో  చిత్రంలో   కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో విూనాక్షి చౌదరి ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

ఇంకా చదవండి: 'లవ్‌మీ' చిత్రం విడుదల వాయిదా!?

# GangsofGodavari     # VishwakSen     # YuvanShankarRaja