విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్
1 month ago | 5 Views
వెర్సటైల్ హీరో విశాల్‌కి దర్శకత్వ శాఖలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్‌ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ..
‘దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మగుదం/మకుటం నుంచి సెకండ్ లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ ప్రారంభ దశలోనే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.. కానీ ఇది ఇంత వరకు పెండింగ్‌లోనే పెట్టాను. ఈ పండుగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నాం. ఈ మూవీతో నేను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని ప్రకటించేందుకు సమయం ఆసన్నమైంది.
అసలు ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ పరిస్థితులు నన్ను ఈ విధంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనే కీలకమైన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఈ నిర్ణయం బలవంతం వల్ల కాదు బాధ్యత వల్ల తీసుకోవడం జరిగింది. ఒక నటుడిగా.. సినిమా అనేది మనల్ని నమ్మే ప్రేక్షకులకు, ప్రతి ప్రాజెక్ట్‌లో తమ విశ్వాసాన్ని, కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే నిర్మాతలకు ఒక నిబద్ధత అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను. ఇప్పుడు మగుదం/మకుటం కోసం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవడం మాత్రమే ఈ సినిమాను ఉన్నతంగా నిలబెట్టడానికి, నిర్మాత ప్రయత్నాలు రక్షించబడటానికి, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి ఏకైక మార్గం.
కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం అంటే బాధ్యత తీసుకోవడం, విషయాలను చక్కదిద్దడం, తద్వారా భవిష్యత్తులోని పెద్ద చిత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా, విజయవంతంగా చూడటానికి వీలుగా ఉంటుంది. ఈ దీపావళి నాకు సరిగ్గా అదే సూచిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని బహిర్గతం చేశాం. ఇకపై ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. మేం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాం. ఇది మాకు కొత్త ఆరంభం.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు
సాంకేతిక సిబ్బంది
నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్‌బి చౌదరి
దర్శకుడు: విశాల్
కథ : రవి అరసు
సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ఎం. నాథన్
ఎడిటర్: ఎన్‌బి శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పీఆర్వో : సాయి సతీష్
ఇంకా చదవండి: సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నవ దళపతి సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధార గ్రిప్పింగ్ & స్పైన్-చిల్లింగ్ ట్రైలర్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




