సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నవ దళపతి సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జటాధార గ్రిప్పింగ్ & స్పైన్-చిల్లింగ్ ట్రైలర్
1 month ago | 5 Views
నవ దళపతి సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ జటాధార నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ప్రేక్షకులకు టెర్రిఫిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.
పురాతన కాలంలో సంపదను దాచడానికి “పిశాచ బంధనం” అనే ఘోర మంత్రాన్ని ఉపయోగించేవారు. ఇది ఆ సంపదను కాపాడేందుకు రాక్షసాత్మల్ని ఆహ్వానించే మంత్రం. భూతాలు లేవని నిరూపించాలనుకునే ఒక స్కెప్టిక్ ఘోస్ట్ హంటర్, ఒకరి లోభం కారణంగా ఈ బంధనాన్ని భంగం చేస్తాడు. దీంతో “ధన పిశాచ” అనే శాపగ్రస్త దయ్యం మేల్కొంటుంది. ఒక చిన్నారి బలి జరగబోతోందన్న భయంకర కలతో, ఆ హంటర్ ఒక దుష్ట శక్తీని అడ్డుకోవడానికి బయలుదేరుతాడు. ఈ అల్లకల్లోలానికి అర్థం కాని దశలో ప్రారంభమవుతుంది శివుడు, సృష్టి .. వినాశనానికి ప్రతిరూపమైన ఆ దివ్య శక్తి.
ట్రైలర్‌లో భూతపిశాచాలు, శాపగ్రస్త ఆలయాలు, ఆధ్యాత్మిక యుద్ధాలు కళ్ళు తిప్పుకోలేని విధంగా చూపించారు. ముఖ్యంగా సుధీర్ బాబు నేలపై వున్న రక్తం త్రాగుతూ తపస్సులోకి వెళ్ళే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించింది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వుంది.
సోనాక్షి సిన్హా ధన పిశాచిగా అదరగొట్టింది. అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తున్నారు.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హారర్ ఎలిమెంట్స్ తో పాటు భారతీయ పురాణ వైభవాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ గ్రాండ్ గా వుంది. రాజీవ్ రాజ్ సంగీతం ప్రతి రీచువల్ సీన్‌లోనూ టెన్షన్, థ్రిల్‌ని పెంచింది.
జీ స్టూడియోస్ ,ప్రేరణ అరోరా (Ess Kay Gee ఎంటర్‌టైన్‌మెంట్) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, డివోషనల్ ఫాంటసీ హారర్ జానర్ ని రిడిఫైన్ చేసేలా వుంది. ట్రైలర్ సినిమాపై బజ్ మరింతగా పెంచింది. సినిమా నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది
ఇంకా చదవండి: డిసెంబర్ 25న ఆది సాయి కుమార్ థ్రిల్లర్ ‘శంబాల’
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మహేష్ బాబు # సుధీర్ బాబు # సోనాక్షి సిన్హా # జటాధార




