సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #Suriya46 షూటింగ్ ప్రారంభం
5 months ago | 5 Views
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ ను నేడు ప్రారంభించారు.
ప్రతిభావంతులు సూర్య, వెంకీ అట్లూరి మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం ప్రకటనతోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా "వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు" అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్ ను చిత్ర బృందం పంచుకుంది.
తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య.. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో తమిళ మరియు తెలుగు అభిమానులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొదటి నుంచి పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ఎప్పటికప్పుడు సృజనాత్మక సరిహద్దులను చెరిపేస్తున్న సూర్య.. ఇప్పుడు 'సూర్య 46'తో మరో వైవిద్యభరితమైన చిత్రాన్ని అందించబోతున్నారు.
లోతైన భావోద్వేగాలను, వాణిజ్య అంశాలను మిళితం చేస్తూ ప్రస్తుత తరంలో గొప్ప కథకులతో ఒకరిగా పేరు పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. గత రెండు చిత్రాలు సార్(వాతి), లక్కీ భాస్కర్ ఘన విజయాలను సాధించి.. దర్శకుడిగా వెంకీ అట్లూరి స్థాయిని మరింత పెంచాయి. సార్, లక్కీ భాస్కర్ తరహలోనే మరో గొప్ప కథను అందించబోతున్నారు వెంకీ అట్లూరి.
'సూర్య 46'పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. 'ప్రేమలు'తో ఆకట్టుకున్న యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి వస్తున్నారు. రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్(వాతి), లక్కీ భాస్కర్ చిత్రాలతో తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన జి.వి. ప్రకాష్ కుమార్.. మరోసారి వెంకీ అట్లూరితో చేతులు కలిపి, తన సంగీతంతో మాయ చేయబోతున్నారు.
ఈ చిత్ర కోసం ప్రతిభగల సాంకేతిక బృందం పని చేస్తోంది. ఛాయాగ్రాహకుడిగా నిమిష్ రవి, కళా దర్శకుడిగా బంగ్లాన్ వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలను ఖాతాలో వేసుకుంటున్న నిబద్ధత గల నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వర్కింగ్ టైటిల్: #సూర్య46 – ప్రొడక్షన్ నెం. 33
తారాగణం: సూర్య, మమిత బైజు, రవీనా టాండన్, రాదిక శరత్ కుమార్
సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఫైట్ మాస్టర్: వి. వెంకట్
కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వరరావు
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఇంకా చదవండి: దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ మృతి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సూర్య # వెంకీ అట్లూరి # Suriya46




