దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ మృతి
5 months ago | 5 Views
'యజ్ఞం' సినిమాతో గోపీచంద్ అనే విలన్ ను హీరోగా మలచిన దర్శకుడు రచయిత ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి మంగళవారం రాత్రి తన ఫ్లాట్ లోనే హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. రాజ్ తరుణ్ తో 'తిరగ బడరా స్వామి' సినిమా తీయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది! దాంతో డిప్రెషన్ కు గురై కొంతకాలంగా భార్య నాగ బిందు కు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు! గుంటూరు కు చెందిన రవి కుమార్ చౌదరి "యజ్ఞం" సినిమా సూపర్ హిట్ కాగానే బాలకృష్ణ తో వీరభద్ర తీశారు.
అనంతరం సాయి ధరమ్ తో అల్లు అరవింద్ నిర్మాతగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చేయగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది! తిరగ బడరా స్వామి సినిమా ఫ్లాప్ తో మానసిక ఒత్తిడికి గురై ఒంటరిగా జీవిస్తూ గుండెపోటు తో చిన్న వయసులోనే చనిపోయారు ‘యజ్ఞం’ తర్వాత బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసే అవకాశం అందుకున్నారు. తర్వాత ‘ఆటాడిస్తా’, ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సౌఖ్యం’ సినిమాలు తీశారు. ఇందులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ బాగా హిట్ అయ్యింది. ‘తిరగబడరా సామీ’ ఆయన చివరి సినిమా. జగడంలో నెగిటివ్ పాత్రలో కనిపించారు.
ఇంకా చదవండి: తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎ.ఎస్ రవికుమార్ # దర్శకుడు




