సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ప్రైమ్ వీడియో "ఉప్పు కప్పురంబు" ట్రెయిలర్ లాంచ్
5 months ago | 5 Views
భారతదేశపు అత్యంత ప్రియమైన వినోదాల గమ్యస్థానం, ప్రైమ్ వీడియో ఈరోజు తన రెండవ తెలుగు ఒరిజినల్ చిత్రము, నిరంకుశాధికార ప్రభుత్వము ద్వారా మరణించినవారి సంఖ్య పెరిగిపోయిన కారణంగా స్మశానంలో చోటు తక్కువ అయిన ఒక దక్షిణభారత పల్లెటూరు లో చిత్రీకరించబడిన హాస్యభరిత చిత్రము, ఉప్పు కప్పురంబు చిత్రం యొక్క ట్రెయిలర్ ను విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై లి. బ్యానర్ పై రాధిక లావూ నిర్మించగా, అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి రచించిన ఈ చిత్రం లో సుహాస్ మరియు జాతీయ అవార్డు-గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ప్రధానపాత్రలు పోషించగా, బాబు మోహన్, శత్రు మరియు తాళ్ళూరి రామేశ్వరి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఉప్పు కప్పురంబు చిత్రము భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలలో జులై 4న ప్రైమ్ వీడియో పై ప్రీమియర్ గా ప్రత్యేక ప్రసారానికి సిద్ధంగా ఉంది. తెలుగు తోపాటు హింది, తమిళం, మళయాళం మరియు కన్నడ భాషలలో డబ్బింగ్ మరియు ఇంగ్లీష్ తో కలిపి 12 భాషలలో సబ్టైటిల్స్ తో ప్రసారం అవుతుంది.
1990 ప్రారంభములో సెట్ చేయబడిన ఈ చిత్ర కథ, చిట్టి జయపురం అనే పల్లెటూరిలో ప్రారంభం అవుతుంది. ఈ పల్లెటూరు ఒక చిత్రమైన సమస్యని ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ ఊరిలో మరణించినవారిని పూడ్చిపెట్టటానికి చోటు లేదు. కొత్తగా నియమించబడిన, ఆదర్శవంతురాలైన గ్రామాధికారి, అపూర్వ (కీర్తి సురేష్) పదవి చేపట్టినప్పుడు ఒక మహిళ అధికారములో ఉండడం జీర్ణించుకోలేని స్థానికులు ఆమెను అపహాస్యం చేస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకున్న ఆమె, ఆ ఊరి కాటికాపరి అయిన చిన్న (సుహాస్) సహాయం కోరుతుంది. కాని వీరి ఉద్దేశాలు ఊరిలో గందరగోళాన్ని రేకెత్తిస్తాయి. స్మశానంలో స్లాట్ బుక్ చేసుకోవడానికి లక్కీ డ్రా నుండి పెరుగుతున్న గ్రామీణ నాటకము వరకు, ఈ ట్రెయిలర్ చమత్కారం, హాస్యం మరియు భావోద్వేగాల రోలర్ కోస్టర్ ను అందిస్తుంది. ఈ ట్రెయిలర్ సామాజిక వ్యంగ్యముతో ఊహించని గందరగోళాన్ని సృష్టించే ఒక ప్రపంచములోకి తొంగి చూస్తుంది.
“ఈ ఉప్పు కప్పురంబు కథ యొక్క వ్యంగ్య మరియు హృద్యమైన సమ్మేళనము నన్ను ఆకట్టుకుంది,” అని కీర్తి సురేష్ తెలిపారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఆమె ఇలా చెప్పుకొచ్చారు, “అపూర్వ అనేది ఒక భిన్నమైన పాత్ర. ఆమె ఆదర్శవాది, దృఢనిశ్చయం కలిగినది. ఆమె పాత్రలో నటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతుల నేపథ్యములో. ఒక గంభీరమైన సమస్యను ప్రజల దృష్టిలోకి తీసుకొని రావటానికి ఈ చిత్రము హాస్యాన్ని మరియు ప్రాంతీయ అభిరుచులను ఉపయోగిస్తుంది, దీనితో ఇది అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఇది కూడా నన్ను బాగా కదిలించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఈ ప్రపంచాన్ని గురించి ప్రైమ్ వీడియోలో చూసి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను.”
“చిన్నా పాత్ర ఇదివరకు నేను చేసిన పాత్రల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది,” అని సుహాస్ అన్నారు, “ఇతను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కుంటాడు. ఈ చిత్రము యొక్క సారాన్ని, దీని చమత్కారమైన, భావోద్వేగమైన మరియు ఆశ్చర్యాలను ట్రెయిలర్ చాలా చక్కగా చూపింది. ఉప్పు కప్పురంబులో నాకు బాగా నచ్చింది, ఇది నీతులు చెప్పేదిగా ఉండదు. ట్రెయిలర్ కేవలం ఒక అంతర్దృష్టి, ఇందులో తెలుసుకునవలసిన అనేక భావోద్వేగాలు ఉన్నాయి మరియు ప్రైమ్ వీడియో పై ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం పై నేను ఆసక్తిగా ఉన్నాను.”
ఇంకా చదవండి: సోలో బాయ్ ట్రైలర్ లాంచ్‌లో గౌతమ్ కృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సుహాస్ # కీర్తి సురేష్ # ఉప్పు కప్పురంబు




