సోలో బాయ్ ట్రైలర్ లాంచ్‌లో గౌతమ్ కృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు
7 months ago | 5 Views
సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి తనతో జంటగా నటించారు. పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజిని వర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జుడా సంధ్య చిత్రానికి సంగీతం అందించారు. జులై 4వ తేదీన వెండి ధరపై ప్రేక్షకులను పలకరించనున్న సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఇటీవలే భారతదేశ రక్షణాదనం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ... "మేము ఎంతో పేద కుటుంబం నుండి వచ్చాము. మాకు ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు ఈరోజు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరొక కొడుకు మాకు దొరికాడు అనుకుంటాము. గౌతమ్ మాట్లాడుతుంటే మా అబ్బాయి మాట్లాడుతున్నట్లే ఉంది. అందుకే నేడు వేరే పని ఉన్నా కూడా కేవలం ఈ చిత్రం కోసం వచ్చాము. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ రాబోతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము" అన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ... "చిత్ర ట్రైలర్ ఎంతో బాగుంది. చాలా మంచి విజువల్స్ కనిపించాయి. సాధారణంగా ఎవరైనా కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమంలోకి వచ్చినప్పుడు ప్యాషన్ తో వచ్చాము అంటారు కానీ ఒకటి రెండు సినిమాలు తీసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ సతీష్ అలా వెళ్ళిపోయేవాడు కాదు. నిజమైన ప్యాషన్ తో వచ్చి ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాడు. చిత్ర బృందం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత రోజులలో ఏదైతే మంచి విజయం సాధిస్తుందో అదే పెద్ద సినిమా. అంతేకానీ ఇక్కడ చిన్న సినిమా అంటూ ఏమీ లేదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ సుధాకర్ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. నా మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా ఇక్కడే ట్రైలర్ లాంచ్ చేసాము. చిత్రం మంచి విజయం సాధించింది. అలాగే సోలో బాయ్ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన సతీష్ గారు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో నిర్మాతగా మారారు. చిత్రానికి ఎంతో గొప్పవారు పాటల అందించారు. చిత్రానికి గౌతమ్ కూడా కొంత డబ్బు ఖర్చుపెట్టడం జరిగింది. అలాగే మురళి నాయక్ కుటుంబాన్ని ఆహ్వానించినందుకు చిత్ర బంధాన్ని అభినందిస్తున్నాను" అన్నారు.
దర్శకుడు యాట సత్యనారాయణ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారం. ముందుగా దేశ రక్షణ కోసం తన ప్రాణాలను నడిపించిన మురళి నాయక్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో చిన్న వయసులోనే తనకు వేరే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ వారిని కాదనుకుని మిలటరీ కి వెళ్లి దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు మురళి నాయక్. అటువంటి వ్యక్తిని ఈ దేశానికి అందించినందుకుగాను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మురళి నాయక్ భారత దేశంలోని మహిళల నుదుటిపై సింధూరం ఉన్నంతవరకు జీవించే ఉంటాడు. ఈ సినిమా చిన్నది అంటున్నారు కానీ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిభవంతులు. కాబట్టి ఇది చిన్న సినిమా కాదు. కరోనా సమయంలో బట్టల రామస్వామి చిత్రంతో ఓటిటి ద్వారా మంచి విజయాన్ని సాధించిన సతీష్ ఇప్పుడు వెండితెరపై మరోసారి విజయాన్ని సాధించబోతున్నారు. ట్రైలర్ చూస్తే డైరెక్టర్ గారు సినిమాను ఎంత బాగా తీశారో అర్థమవుతుంది. చిత్రంలో నటించిన ప్రతి నటీనటులు అందరికీ బాగా తెలిసిన వారు, ఎంతో బాగా నటించారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.
ఇంకా చదవండి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' భారీ సెట్‌లో ఇంటెన్స్ & ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ట్రైన్ యాక్షన్ బ్లాక్ షూటింగ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




