ఘన విజయానికి హామీ ఇస్తున్న రవితేజ 'మాస్ జాతర' టీజర్
3 months ago | 5 Views
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న 'మాస్ జాతర' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు 'మాస్ జాతర' టీజర్ లో ఉన్నాయి. నిజానికి అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. రవితేజ శైలి యాక్షన్ మరియు వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్టైనర్ ను చూడబోతున్నామనే హామీని టీజర్ ఇస్తోంది.
మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు వినోదాన్ని మేళవిస్తూ టీజర్ ను మలిచిన తీరు ఆకట్టుకుంది. అభిమానులు కోరుకునే అసలుసిసలైన మాస్ రాజా తెరపై ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్ తో కట్టిపడేశారు.
శ్రీలీల మరోసారి బలమైన పాత్రలో మెరిసిపోయారు. రవితేజ, శ్రీలీల ఎప్పుడు తెరను పంచుకున్నా అది స్వచ్ఛమైన మాయాజాలానికి హామీ ఇస్తుంది. 'మాస్ జాతర' టీజర్ లో ఈ జోడి మరోసారి మాయ చేసింది.
దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అసలైన పండుగ సినిమాలా 'మాస్ జాతర'ను మలుస్తున్నారు. వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ కోసం తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. టీజర్ లో నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభించింది. ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా పనితనం ఆకట్టుకుంది. ఎడిటర్ నవీన్ నూలి ఎప్పటిలాగే సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తున్నారు.
వరుసగా ప్రేక్షకులను మెప్పించే చిత్రాలను అందించడంలో ప్రసిద్ధి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై 'మాస్ జాతర' చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆగస్టు 27న థియేటర్లలో మాస్ జాతర
'మాస్ జాతర' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ చిత్రం.. అభిమానుల ఈలలు, గోలలతో మాస్ పండుగను తీసుకురాబోతుంది. అప్పటి వరకు ఈ టీజర్ మాస్ మహారాజా తిరిగి వచ్చాడని అందరికీ గుర్తు చేస్తుంది. మొత్తానికి 'మాస్ జాతర' రూపంలో విందు భోజనం లాంటి సినిమా చూడబోతున్నాం.
తారాగణం: రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఇంకా చదవండి: నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ 'శివ' త్వరలో తెలుగులో రీ-రిలీజ్, ఆ తర్వాత హిందీ, తమిళ భాషలలో విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




