నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కల్ట్ క్లాసిక్ 'శివ' త్వరలో తెలుగులో రీ-రిలీజ్, ఆ తర్వాత హిందీ, తమిళ భాషలలో విడుదల
3 months ago | 5 Views
శివ రీ-రిలీజ్ టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న కూలీతో వస్తోంది. ఆడియన్స్ డాల్బీ అట్మోస్‌లో 4 కె విజువల్స్‌తో శివ కొత్త సౌండ్, విజువల్ ని ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.
ఇండియన్ సినిమాల్లో మైలురాయిగా నిలిచిన శివ ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ సారి సౌండ్ మొత్తం హై ఎండ్ AI టెక్నాలజీతో రీ–డిజైన్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్‌లో, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివా తన రా ఇంటెన్సిటీ, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సినిమాకు కొత్త డెఫినిషన్ ఇచ్చింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. CNN–IBN టాప్ 100 ఇండియన్ ఫిల్మ్స్‌లో స్థానం సంపాదించింది.
ఇప్పుడు, అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్లీ థియేటర్స్‌లోకి వస్తోంది. ఒరిజినల్ మోనో మిక్స్ సౌండ్‌ను తొలిసారి డాల్బీ ఆట్మాస్, హై ఎండ్ AI ఇంజనీరింగ్‌తో రీ–క్రియేట్ చేశారు.
ఈ రీ–రిలీజ్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. “శివ నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా. నా క్యారెక్టర్ మరిచిపోలేని స్థాయికి వెళ్లింది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉండటం చూసి, నా అన్నయ్య వెంకట్ అక్కినేని, నేను కలిసి, దీన్ని గ్రాండ్‌గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త జెనరేషన్‌కి కూడా థియేటర్‌లో అనుభవం ఇవ్వాలని అనుకున్నాం. అందుకే RGV, వెంకట్, నేను కలసి, డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4K విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం'అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాగార్జున, ప్రొడ్యూసర్స్ నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రోజుకీ ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్‌ను గుర్తుపెట్టుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు నిజంగా థ్రిల్ ఇచ్చింది. ఒరిజినల్ సౌండ్ అప్పట్లో చాలా హైగా అప్రిషియేట్ చేయబడినా, ఈ రోజు స్టాండర్డ్స్‌కి సరిపడేలా మొత్తం రీ–డూ చేయాలని నిర్ణయించుకున్నాం. అడ్వాన్స్‌డ్ AI టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ ఆట్మాస్‌కి మార్చాం. శివని అందరూ చూసే ఉంటారు, కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్ పీరియన్స్ చేయలేదు.ఈ సారి ఆ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ'అన్నారు.
ఇంకా చదవండి: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ 'కిష్కిందపురి' సెప్టెంబర్ 12న రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




