ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న విడుదల కాబోతున్న 'యుఫోరియా' సినిమా గురించి మరింత సమాచారం:
1 month ago | 5 Views
గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో.. నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాణంలో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతో గుణ శేఖర్ నేటి యూత్‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, ఫ్లై హై పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
దీపావళి పండుగ సందర్భంగా ‘యుఫోరియా’ చిత్రాన్ని డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు. పోస్టర్‌ను గమనిస్తే భూమిక స్మైలీ లుక్‌లో కనిపిస్తోంది. మరో చోట ఓ పిల్లాడుతో సరదాగా నవ్వుకుంటోంది. 20 ఏళ్ల క్రితం గుణ శేఖర్, భూమిక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీలో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. యుఫోరియా కోసం మరోసారి ఈ బ్లాక్ బస్టర్ కాంబో చేతులు కలిపింది. భూమికను దృష్టిలో ఉంచుకుని గుణశేఖర్ ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారు.

అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటూనే చక్కటి మెసేజ్ కూడా యుఫోరియా సినిమాలో ఉంటుంది. కాల భైరవ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు :భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు
సాంకేతిక వర్గం :
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: గుణశేఖర్
సమర్పణ: రాగిణి గుణ
నిర్మాత: నీలిమ గుణ, యుక్తా గుణ
సంగీతం: కాల భైరవ
సినిమాటోగ్రాఫర్: ప్రవీణ్ కె పోతన్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: నాగేంద్ర కాశి, కృష్ణ హరి
పీఆర్వో : వంశీ కాకా
ఇంకా చదవండి: విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




