విడుదలకు సిద్ధమైన 'బకాసుర రెస్టారెంట్‌'

విడుదలకు సిద్ధమైన 'బకాసుర రెస్టారెంట్‌'

6 months ago | 5 Views

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌',   ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నా అంగీ జాతీయం.. నీ లుంగీ జాతీయం' అంటూ కొనసాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. బ్యాచ్‌లర్‌ కష్టాలు, బ్యాచ్‌లర్‌ లైఫ్‌లో ఉండే ఆనందాలు తెలియజేస్తూ విష్ణు వర్థన్‌ ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. పూర్తి వినోద భరితంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు. 


ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ,  ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

ఇంకా చదవండి:  జూన్ 6న రానున్న ' శ్రీ శ్రీ శ్రీ రాజావారు'

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# బకాసుర రెస్టారెంట్‌     # ప్రవీణ్‌    

trending

View More