జూన్ 6న  రానున్న ' శ్రీ శ్రీ శ్రీ రాజావారు'

జూన్ 6న రానున్న ' శ్రీ శ్రీ శ్రీ రాజావారు'

6 months ago | 5 Views

నార్నే నితిన్ ,చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో.తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు నార్నే నితిన్ .అలాగే  జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె  నితిన్‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్  గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్ తో  యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ  చిత్రంఅత్యధిక థియేటర్లలో  జూన్ 6న ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల  చేశారు.   

ఈ సందర్భంగాదర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - మా "శ్రీ శ్రీ శ్రీ రాజావారు"  సినిమా సాంగ్స్, ట్రైలర్ ను సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి,  యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ సంపద మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎలా ఎక్కువమంది మనవాళ్లు ఉండేవారే. నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. మరుగున పడిన కొన్నింటిని చూపించాలనే నా మూవీస్ ద్వారా తాపత్రయపడుతుంటాను. అలాంటి ప్రయత్నమే "శ్రీ శ్రీ శ్రీ రాజావారు" . ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు. అన్ని విషయాల్లో ఆకట్టుకుంటుంది. నా టెక్నికల్ టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అయితే మేము ఎంత కష్టపడినా మీ ఆదరణ ఉంటేనే సక్సెస్ అవుతుంది. జూన్ 6న థియేటర్స్ లోకి వస్తున్న "శ్రీ శ్రీ శ్రీ రాజావారు"  సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.


నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ - ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె  నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ  జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలో మరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా  నమ్ముతున్నాం. అని అన్నారు. నటీనటులు - నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆ

నంద్, జబర్దస్త్ నాగి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. టెక్నికల్ టీమ్ - సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ  డిజైనర్: ఈశ్వర్, పి అర్ ఓ: బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.హెచ్. శర్మ, రాజీవ్ కుమార్, సహ నిర్మాత: ఎమ్. సుబ్బారెడ్డి,  నిర్మాత: చింతపల్లి రామారావు,   రచన - దర్శకత్వం: సతీష్ వేగేశ్న

ఇంకా చదవండి:  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా'

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# శ్రీ శ్రీ శ్రీ రాజావారు     # నార్నే నితిన్     # సంపద    

trending

View More