'అఖండ 2' పై బాలయ్య ఏమన్నారంటే!

'అఖండ 2' పై బాలయ్య ఏమన్నారంటే!

19 days ago | 5 Views

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఎస్ థమన్  #BB4 అఖండ 2: తాండవం నుంచి ది తాండవం సాంగ్ గ్రాండ్ గా లాంచ్

గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.  ఎస్ థమన్ సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్-ది తాండవం ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, ముంబైలోని జుహూలోని PVR మాల్‌లో జరిగిన ఈవెంట్ లో పూర్తి పాటను లాంచ్ చేశారు

బాలయ్యకు హై-వోల్టేజ్ సౌండ్‌ట్రాక్‌ల అదించే ఎస్‌.థమన్‌ ‘అఖండ 2’ కోసం మరోసారి డివైన్ ఫుల్ సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో బాలకృష్ణ అఘోర అవతారంలో, అఘోర మంత్రాలతో దద్దరిల్లుతున్న భారీ ఆలయ ప్రాంగణంలో శివ తాండవం చేయడం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రతి ఫ్రేమ్‌లోని డివైన్ ఇంటెన్సిటీ థమన్ ట్రేడ్‌మార్క్ పెర్కషన్- స్కోర్‌తో అదిరిపోయింది.

శంకర్‌ మహదేవన్‌, కైలాష్‌ ఖేర్‌  పవర్ ఫుల్ వోకల్స్ పాటకు డివైన్ వైబ్ ని యాడ్ చేశాయి. లిరిసిస్ట్‌ కళ్యాణ్‌ చక్రవర్తి శివుని మహోన్నత శక్తిని పదాల్లో అద్భుతంగా మలిచారు. వినగానే గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఈ పాట ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన డివోషనల్ సాంగ్ గా నిలిచింది.

ఈ చిత్రంలో సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సి.రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌. అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


సాంగ్ లాంచ్ ఈవెంట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, నా అభిమానులకు ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ధన్యమైన జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా ప్రణామాలు. వారి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. మా నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. బసవ తారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి ఉచితవైద్యం అందించడం జరుగుతోంది. ఇంతమంది అభిమానుల్ని పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం అఖండ2లో సినిమాలో చూస్తారు. ధర్మంగా బ్రతకండి సత్యం మాట్లాడండి అన్యాయానికి తలవంచకండి..ఇది అఖండ తాండవం. బోయపాటి గారితో మూడు సినిమాలు చేశాం. సింహ లెజెండ్ అఖండ.. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి గారు నేను ఒకటే వేవ్ లెంత్ లో వర్క్ చేస్తాం. తమన్ తో అఖండ వీరసింహారెడ్డి నేలకొండ భగవంత కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ2. మాది అద్భుతమైన కాంబినేషన్.  కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహదేవన్ గారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి. బజరంగ్ భాయిజాన్ తర్వాత హర్షాలి ఈ సినిమా చేసింది. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర. ఆది పినిశెట్టి అద్భుతమైన నటుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆచంట రామ్ గారు గోపి  గారి నిర్మాణంలో నాకు ఇది రెండో సినిమా. చాలా మంచి సినిమాలు తీయాలి ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని తపనతో ఉండే ప్రొడ్యూసర్స్.జార్జియా,  మధ్యప్రదేశ్ ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేసిన సినిమా ఇది. సినిమాని ప్రజెంట్ చేస్తున్న నందమూరి తేజస్విని మా అమ్మాయి. నేను హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ ఇండియాలో నెంబర్ వన్ షో. ఆ షోకి  మా అమ్మాయి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేశారు. అఖండ2 చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. ముంబై ఈవెంట్ లో ఈ సాంగ్ ని లాంచ్ చేయడం ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్యు. జైహింద్.. జై భారత్.. జై హైందవ సనాతన ధర్మం.

డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, ఇది ఒక సినిమా కాదు భారతదేశ ఆత్మ. భారతదేశం యొక్క ధర్మం. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అదే ఫీల్ అవుతారు. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్లి ఆనందంగా చూసే సినిమా ఇది. మన దేశం మన వేదం మన కల్చర్ మన ఇవన్నీ ఈ సినిమాలో మీరు చూస్తారు. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారితో నాలుగు సినిమాల జర్నీ. ప్రతి సినిమా  ట్రెమండస్ హిట్. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో  ఎవరూ చెప్పలేరు. మా నిర్మాతలకి థాంక్యూ. కైలాష్ కేర్ గారు అద్భుతంగా పాడారు. తమన్ గారికి థాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్  మైనస్ 12 డిగ్రీస్ లో  షూట్ చేసాం. మాకు ఆ శివుడే దారి చూపించాడు. సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. తప్పకుండా అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ..  బాలయ్య గారు లాయల్ .. రాయల్. ఆయన అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ప్రజలు అంటే ఆయనకి చాలా ప్రేమ. సినిమాల్లో నిజ జీవితంలో లెజెండ్. ఆయన పట్ల నా ప్రేమని మ్యూజిక్ ద్వారానే తెలియజేస్తున్నాను. బాలయ్య గారి ప్రతి సినిమా నాకు ఒక కేస్  స్టడీ. ఆయన ప్రతి సినిమా నుంచి నేను ఎంతో నేర్చుకుంటున్నాను. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. దూకుడు సినిమా నుంచి వాళ్ళతో జర్నీ ఉంది. ఈ సినిమా అఖండకు మించి ఉంటుంది. బాలయ్య గారు అంటే హిస్టరీ. చరిత్ర సృష్టిస్తూనే ఉంటారు. ఇంటర్వెల్ సీన్ మీకు పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది.

సింగర్ కైలాష్ కేర్ మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. నా కెరియర్ లో ఎన్నో పాటలు పాడాను. అయితే నాకు గొప్ప ఆరంభం ఇచ్చింది మాత్రం సౌత్ సినిమాలే. బాహుబలిలో శివుని తాండవం స్తోత్రం పాడాను ఆధ్యాత్మికతలోనే మన సంగీతం ఉంది. సౌత్ నుంచి వచ్చే ప్రతి సినిమా విజయాన్ని సాధిస్తుంది. అఖండ తాండవం ఈ మాట వినగానే చాలా ఆనందంగా అనిపించింది. తమన్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ సినిమాలో పాట పడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. బాలకృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ లెజెండ్. ఇంత మంచి టీం తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.  

నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది వండర్ఫుల్ జర్నీ. ముంబై మా పాన్ ఇండియా ప్రమోషన్స్ ఇక్కడి  నుంచి స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హీరో బాలకృష్ణ గారికి డైరెక్టర్ బోయపాటి గారికి థాంక్యూ. అఖండ 2  పాన్ ఇండియా బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ కాబోతోంది.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ..  అందరికి నమస్కారం. బాలయ్య బాబు గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బంగారం లాంటి మనసు ఉన్న మనిషి.  బోయపాటి గారు బాలయ్య గారు తమన్ ఈ కాంబినేషన్లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఈ సినిమా సునామీ సృష్టించబోతోంది.

హర్షాలి  మాట్లాడుతూ.. లెజెండ్రీ బాలకృష్ణ గారితో కలిసి  పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.  ఇది నాకు చాలా స్పెషల్  ఫిల్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.  

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

బ్యానర్: 14 రీల్స్ ప్లస్

సమర్పణ: ఎం తేజస్విని నందమూరి

సంగీతం: థమన్ ఎస్

DOP: C రాంప్రసాద్, సంతోష్ D Detakae

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

ఎడిటర్: తమ్మిరాజు

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

PRO: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో
ఇంకా చదవండి: 'కాంత'కి వచ్చిన రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చింది. టాప్ క్లాస్ సినిమా తీసినందుకు ప్రౌడ్ గా ఉంది: ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# బోయపాటి     # అఖండ    

trending

View More