గత వైభవవం విజువల్స్ అద్భుతంగా వున్నాయి. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున
23 days ago | 5 Views
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు. ఈ రోజు మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత వైభవం సినిమా గురించి ఆషికా చెబుతూనే ఉంది. తను ఈవెంట్ కి రావాలని అడగడం, నేను వచ్చేయడం వెంటనే జరిగిపోయాయి. నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్నగారి సినిమా మూగమనసులతో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో జానకి రాముడు సినిమా చేశాను. రెండు సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి.గత జన్మలు అనేది మన కల్చర్ లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పుడు నుంచి వింటుంటాం. గత వైభవం నాలుగు జనరేషన్ల కథ, ట్రైలర్ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. దుష్యంత్ స్క్రీన్ మీద ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నాడు. ఆషికా అద్భుతమైన నటి. ఈ సినిమా కోసం ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా బాగా ఆడాలి. హనుమాన్ లాంటి సినిమాను అందించిన చైతన్య గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.
హీరో దుష్యంత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కొంతమందిని దూరం నుంచి చూసినప్పుడు అభిమానం కలుగుతుంది. పర్సనల్ గా మీట్ అయి వాళ్ల గురించి తెలుసుకున్నప్పుడు అభిమానం ఇంకా పెరుగుతుంది. నాగార్జున గారు అలాంటి స్టార్. నాగార్జున గారి ఐకానిక్ సినిమా శివ నవంబర్ 14న రి రిలీజ్ అవుతుంది. మా సినిమా కూడా వస్తుంది. ఈ సమయంలో కూడా ఆయన మా సినిమాకి ప్రమోట్ చేయడానికి రావడం అనేది ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆయన సపోర్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత వైభవం నాలుగు జన్మలకు సంబంధించిన కథ. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. చాలా బిగ్ కాన్వాస్ సినిమా ఇది. మంచి సినిమాకి తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మీ అందరి లవ్ అండ్ సపోర్టు మాకు కావాలి.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. ఈ సినిమా ఈవెంట్ కి ఎవరిని పిలవాలి? మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఎవరు అందిస్తారు అనుకున్నప్పుడు మేమందరం నాగార్జున గారు వస్తే బాగుంటుందనుకున్నాము. నాగార్జున గారు ఎంతో మంచి మనసున్న మనిషి. ఆయన లాంటి స్టార్ మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు కూడా కొత్త కాంటెంట్, కథలపై ఆసక్తి చూపిస్తుంటారు. ఆయనకి టీజర్ ట్రైలర్ చాలా నచ్చాయి. ఈవెంట్ కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన నాగార్జున గారికి మరోసారి కృతజ్ఞతలు.
డైరెక్టర్ సింపుల్ సుని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం గత వైభవం. అంటే ఒక సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. ఆ సామ్రాజ్యానికి రాజులా నాగార్జున గారు వచ్చారు. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. గత వైభవం డిఫరెంట్ జానెర్ సినిమా. అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఎక్స్పరిమెంటల్ ఫిల్మ్. తప్పకుండా ఆడియన్స్ అందరూ సినిమా ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దీపక్ కి థాంక్యూ. టీమ్ అందరికీ గుడ్ లక్. ఈ టీజర్ చూడగానే మన సినిమాల్లో జగదేకవీరుడు అతిలోకసుందరి వైబ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఇలాంటి ఫాంటసీ సినిమా రాలేదు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాము.
నిర్మాత దీపక్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది మాకు చాలా స్పెషల్. నాగార్జున గారు అద్భుతమైన పెర్ఫార్మర్. ఆయన శివ సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. రు ఆయన మా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు నిరంజన్ రెడ్డి చైతన్య గారికి థాంక్యూ. తెలుగు నార్త్ అమెరికాలో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. శివ సినిమా చూస్తున్నప్పుడు నాగార్జున గారిలో ఒక స్పార్క్ కనిపించింది. అదే స్పార్క్ నేను దుష్యంత్ లో చూశాను .తప్పకుండా గత వైభవం సినిమా మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముందు శివ చూడండి. తర్వాత గత వైభవం చూడండి.
డిఓపి విలియం డేవిడ్ మాట్లాడుతూ.. టెక్నికల్ గా చాలా మంచి సినిమా. నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలుస్తుంది. నవంబర్ 14న అందరూ థియేటర్లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గత వైభవవం # నాగార్జున




