సినిమా అందరికీ అందుబాటులో ఉండాలి: టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

సినిమా అందరికీ అందుబాటులో ఉండాలి: టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్

5 months ago | 5 Views

తెలుగు చిత్ర పరిశ్రమలోని పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్న తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్. ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై థియేటర్స్ టికెట్ రేట్స్, తిను బండారాల ధరలు  వంటి విషయాలపై చర్చించడం అభినందనీయం అన్నారు రామకృష్ణ గౌడ్. ఆయన ఈ రోజు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా


టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - నేను కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి టికెట్ రేట్స్, థియేటర్స్ లో తినుబండారాల రేట్స్ తదితర సమస్యల గురించి ప్రస్తావించాను. ఈ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషకరం. డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో ఇటీవల కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చించారు. సినిమాను సామాన్య ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని మేము కోరుతున్నాం. సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడుతోంది. థియేటర్స్ లో టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండటం, తినుబండారాల రేట్స్ అధికంగా ఉండటంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇటీవల తమ్ముడు సినిమా ఫంక్షన్ లో దిల్ రాజు గారు టికెట్ రేట్స్ పెంచమని చెప్పడం అభినందనీయం. అలాగే క్యూబ్, యూఎఫ్ వో వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ రేట్స్ ముంబై వంటి ఉత్తరాది నగరాల్లో రూ. 3 వేల లోపు ఉంటే, మన దగ్గర 10 నుంచి 15 వేల రూపాయల దాకా ఉంటోంది.

నేను ఇటీవల ఝాన్సీ అనే సినిమా 50 థియేటర్స్ లో రిలీజ్ చేస్తే 5 లక్షల రూపాయలకు పైగా ఈ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ కే ఖర్చయ్యింది. ఇది చిన్న నిర్మాతల మీద భారంగా మారుతోంది. ఏడాదికి నిర్మాణమయ్యే చిత్రాల్లో 90శాతం చిన్న నిర్మాతలవే. పెద్ద సంఖ్యలో సినిమాలు రిలీజ్ కు కూడా చేసుకోలేకపోతున్నాయి. ఇలా దాదాపు 400 నుంచి 500 చిత్రాల దాకా ఇలా కంప్లీట్ అయ్యి రిలీజ్ కాకుండా ఆగిపోయి ఉన్నాయి. టాలీవుడ్ కు పవన్ కల్యాణ్ గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కల్పించుకుని చార్జెస్ తగ్గించాలని కోరుకుంటున్నాము. త్వరలో ఆయనను మా టీఎఫ్ సీసీ తరుపున కలిసి అభినందనలు తెలియజేస్తాం. చిత్ర పరిశ్రమలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు ఆడితేనే నిర్మాత బాగుంటాడు. బుక్ మై షో వంటి ప్లాట్ ఫామ్స్ వల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతోంది. ఎఫ్ డీసీ ద్వారా ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం తీసుకురావాలి. అప్పుడే ప్రైవేట్ టికెట్ బుకింగ్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయగలం. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు డిఫ్యూటీ సీఎంలకు మా టీఎఫ్ సీసీ తరుపున రిప్రజెంటేషన్ ఇస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎఫ్ సి సి   ఫైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి: ఈ నెల 13న వస్తోన్న నిజం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# టీఎఫ్‌సీసీ     # డా. ప్రతాని రామకృష్ణ గౌడ్    

trending

View More