కాలానుగుణంగా నటులు మారాల్సిందే :  విద్యాబాలన్‌

కాలానుగుణంగా నటులు మారాల్సిందే : విద్యాబాలన్‌

6 months ago | 5 Views

 బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 సంవత్సరాలు అయినా.. ఇప్పటికీ తనదైన అభినయంతో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ వస్తున్నది. హిందీతో పాటు  బెంగాళీ, మలయాళం, తమిళ భాషల్లోనూ తన ప్రతిభను చాటిన ఆమె.. 2019లో తెలుగు సినీరంగంలోకి 'ఎన్టీఆర్‌: కథానాయకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'జటాధర’ అనే సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.  విద్యా బాలన్‌ తన అభిప్రాయాలను కూడా నిర్భయంగా వ్యక్తపరుస్తూ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

Vidya Balan reveals male actors still reluctant to share screen space with  her | Hindi Movie News - Times of India

సినీ పరిశ్రమలో మార్పులు అనివార్యమని, కాలానుగుణంగా నటీనటులూ మారాలని ఆమె సూచించారు. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలను బట్టి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడే వారు దీర్ఘకాలం పరిశ్రమలో కొనసాగగలరని.. లేకపోతే అభిమానులకు దూరవుతారని.. ఫేడవుట్‌ అవుతారని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో తాను చాలా అల్లరి చేసేదానినని, రాత్రిళ్లు మేలుకొని ఉండటం తన అలవాటని, ఆ అలవాటును విడిచిపెట్టడం పెద్ద సవాలుగా మారిందని చెప్పారు. సినిమాలు తన జీవితంలో కీలకపాత్ర పోషించాయని, అవే తనను పూర్తిగా మార్చేశాయని వెల్లడిరచారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో కొనసాగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. విద్యా బాలన్‌ చివరిసారిగా భూల్‌ భూలైయా 3 మూవీలో కనిపించారు.

ఇంకా చదవండి:  ‘షష్టిపూర్తి’ టీమ్ ని అభినందించిన ఇళయరాజా

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# విద్యా బాలన్‌    

trending

View More