'డ్యూడ్‌ 'లో చేసిన కురల్ క్యారెక్టర్ చాలెజింగ్ గా అనిపించింది. హీరోయిన్ మమిత బైజు

'డ్యూడ్‌ 'లో చేసిన కురల్ క్యారెక్టర్ చాలెజింగ్ గా అనిపించింది. హీరోయిన్ మమిత బైజు

1 month ago | 5 Views

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్‌తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్  మమిత బైజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-ప్రేమలు రిలీజ్‌ తర్వాత మేకర్స్ నన్ను సంప్రదించారు. ఆ తర్వాత డైరెక్టర్ తో మీటింగ్ జరిగింది. కీర్తి తొలిసారిగా నన్ను సంప్రదించినప్పుడు,  కథను చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది. కాన్సెప్ట్‌ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించింది.

-ఆ కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం వుంది. కురల్  పాత్రలో చాలా డిఫరెంట్ గా వుంటుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు.  

-“కురల్” చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా వుంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.  

-ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ నాకు సవాలు గా అనిపించాయి. ఆ సీన్స్‌ కోసం నేను రాత్రంతా డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. షూట్‌ సమయంలో వాటి గురించి ఆందోళన లేకుండా సీన్‌ మీద ఫోకస్‌ చేశా. నేను ఎప్పుడూ షూట్‌కు ముందు బాగా ప్రిపేర్‌ అయి ఉండాలని చూసుకుంటాను. అందుకే ఇది నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా అనిపించింది.

-ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి పనిచేయడం  గొప్ప ఎక్స్ పీరియన్స్. ఆయనతో సెట్‌లో పని చేయడం చాలా ఫన్‌గా, సౌకర్యంగా ఉంటుంది. ఏ సీన్‌ అయినా సహజంగా, సంతోషంగా మార్చేస్తారు.  ఎంత సక్సెస్‌ వచ్చినా ఆయన చాలా సింపుల్‌గా వుంటారు. ఆయనతో నటించడం చాలా ఈజీగా అనిపించింది. ప్రేక్షకులతో ఆయనకు ఉండే కనెక్షన్‌ అది స్క్రీన్‌పై మాత్రమే కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా అంతే లవబుల్ గా వుంటుంది .మా పాత్రలు కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.


-శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్స్ తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

-. కీర్తిశ్వరన్‌ సర్‌తో పనిచేయడం అద్భుతంగా అనిపించింది. ఆయన చాలా క్లియర్‌ విజన్ తో వుంటారు. ఆయన గైడెన్స్‌ వల్ల నేను నా పాత్రను లోతుగా కనెక్ట్‌ అయ్యి, సహజంగా నటించాను.

-సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. పాటలు మనసుని ఆకట్టుకుంటాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

-నికేత్‌ బొమ్మితో పనిచేయడం అద్భుతమైన అనుభవం! ఆయనతో ఇదే నా మొదటి కోలాబరేషన్‌, ఆయన స్టైల్‌కి నేను పెద్ద అభిమానిని. ఆయన విజువల్స్‌ సినిమాకి జీవం పోస్తాయి. ప్రతి ఫ్రేమ్‌ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు.

-మైత్రీ మూవీ మేకర్స్ తో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. చాలా పాషనేట్ ప్రొడ్యూసర్స్. సినిమాని చాలా గ్రాండ్ గా తీశారు.  

-DUDE అన్ని వయసుల ప్రేక్షకులకు, ముఖ్యంగా కుటుంబాలకు, యువతకు నచ్చే సినిమా అవుతుంది. ఇది ఫన్‌గా, లైట్‌హార్ట్‌డ్‌గా ఉన్నా, లోపల ఒక మీనింగ్ ఫుల్ కోర్‌ ఉంది.  

-ఇది పండుగకి పర్ఫెక్ట్ సరిపోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఈ దీపావళికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

-నా అభిమానులు, తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ DUDE సినిమాకి ప్రేమ చూపించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఎంతో మనసు పెట్టి తీసినది. కుటుంబం, స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లి ఎంజాయ్‌ చేయండి, ఈ దీపావళిని DUDEతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను,

ఇంకా చదవండి: 'ఆర్యన్' నుంచి ఐయామ్ ది గాయ్ సాంగ్ రిలీజ్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# డ్యూడ్‌     # మమిత బైజు    

trending

View More