ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో జపాన్ బృందం భేటీ..
4 days ago | 5 Views
హైదరాబాద్‌ను చలనచిత్ర కార్యకలాపాలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలనే తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి దార్శనికత, సంకల్పం అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ – టోక్యో, జపాన్ నుండి జపాన్ ఫిల్మ్ – అనిమే పరిశ్రమ ప్రతినిధి బృందంతో సంభాషించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను, దానిని సాకారం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. డిజిటల్ పైరసీని ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమకు పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ , తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సందర్భంగా జపాన్ ప్రతినిధి బృందాన్ని, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అభినందించారు. చిత్ర పరిశ్రమ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ ఉప ముఖ్యమంత్రులకు వారు ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది.
జపాన్ ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. ముందుగా వారు ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రికి కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రయాణం , భారతదేశంలో.. ప్రపంచవ్యాప్తంగా జపనీస్ కంటెంట్‌కు పెరుగుతున్న ప్రజాదరణ గురించి వివరించారు. జపాన్‌లో తెలుగు చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ గురించి కూడా తెలిపారు. తరువాత జపాన్‌లోని టోక్యోలోని కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ ప్రతినిధి డైరెక్టర్ టకేరో గోటో, అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ సీనియర్ డైరెక్టర్ తత్సుయ ఓట్సుకా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సందర్శించి ఈ సంతకం చేశారు. డిజిటల్ పైరసీకి వ్యతిరేకంగా బెస్ట్ ప్రాక్టీసెస్, వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలపై నాలెడ్జ్ ని పంచుకోవడానికి ఈ ఎం.ఓ.యు రూపొందించడం జరిగింది. ఆ తర్వాత బృందం యాంటీ వీడియో పైరసీ సెల్ ఉపయోగించే పద్ధతులు, సాఫ్ట్‌వేర్ సాధనాలను పరిశీలించింది. పైరసీని ఎదుర్కోవడంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విధానాన్ని ప్రశంసించింది. ఇటీవలి కాలంలో డిజిటల్ పైరసీ ఒక అంతర్జాతీయ క్రైమ్ గా ఉద్భవించింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్‌లైన్ మోసం, మాల్వేర్ వ్యాప్తి.. చాలా వైవిధ్యమైన స్వభావం గల సైబర్ నేరాలు డిజిటల్ పైరసీతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, సంస్థలు, ప్రభుత్వాలు ద్వైపాక్షిక బహుళ-పాక్షిక ఒప్పందాలు సహకారాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంలోనే కంటెంట్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జపనీస్ ఫిల్మ్ అనిమే పరిశ్రమ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జపనీస్ ఫిల్మ్ అనిమే పరిశ్రమతో ఈ రకమైన అధికారిక సహకారాన్ని కలిగి ఉన్న భారతదేశంలో మొట్టమొదటి చిత్ర పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ సెక్రటరీ కె. ఎల్ దామోదర్ ప్రసాద్, రామానాయుడు స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ బాబు దగ్గుబాటి, అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ, యాంటీ వీడియో పైరసీ సెల్ టీఎఫ్‌సీసీ చైర్మన్ రాజ్‌కుమార్ ఆకెళ్ల, ఏవీపీసీ ఆపరేషన్స్ హెడ్ వై.మనీంద్ర పాల్గొన్నారు.
ఇంకా చదవండి: ఆంధ్ర కింగ్ తాలూకా బ్లాక్ బస్టర్ కు అభిమానుల అద్భుత స్పందనపై ఉపేంద్ర ధన్యవాదాలు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జపాన్ # రేవంత్ రెడ్డి




